- కొత్తగా 16 కేసులు నమోదు
- అత్యధికం హైదరాబాద్‌లోనే
రాష్ట్రంలో కొరోనా రోగుల సంఖ్య 487కి చేరింది. శుక్రవారం కొత్తగా 16 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈమేరకు శుక్రవారం సాయంత్రం రాత్రి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రాస్ట్రంలో ఇప్పటి వరకు కొరోనా పాజిటివ్ కారణంగా 12 మంది మృతి చెందగా, 45 మంఇ కోలుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకుల కార్యాలయం మరో మీడియా బులెటిన్ విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం ఇప్పటి వరకు రాస్ట్ర రాజధాని హైదరాబాద్ 179 పాజిటివ్ కేసులతో ప్రథమ స్థానంలో ఉందగా, 49 కేసులతో నిజామాబాద్ రెండో స్థానంలో, రంగారెడ్డి 27, మేడ్చల్ 21 కేసులతో తరువాతి స్థానాలలో ఉన్నాయి. ఆ తరువాత ఆదిలాబాద్ 10, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, ములుగు, నాగర్‌కర్నూలు, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాలలో 2 కేసుల చొప్పున నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ 23, జోగులాంబ గద్వాల 19, నల్గొండ 12, నిర్మల్ 15, సూర్యాపేట 9, వికారాబాద్ 8, కరీంనగర్, సంగారెడ్డి జిల్లాలలో 7, మహబూబ్‌నగర్ 10, మహబూబాబాద్ 1, మెదక్ 5 కేసులు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రంలోని అతి తక్కువ కేసులు సిరిసిల్ల, మహబూబాబాద్ జిల్లాలలో ఒక్కో జిల్లాలో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు మీడియా బులెటిన్‌లో పేర్కొన్నారు.