- దాదాపు 20మందికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం
- పూర్తిస్థాయి శానిటైజ్
గ్రేటర్ హైదరాబాద్‌లో కొరోనా విలయతాండవం చేస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన లీడర్లు కొరోనా బారిన పడి వివిధ దవాఖాలనాలలో చికిత్స పొందుతున్నారు. తాజాగా వైరస్ ప్రగతిభవన్‌లోకి కూడా ప్రవేశించింది. వారం రోజుల్లో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న 20 మంది సిబ్బందికి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రగతి భవన్ ను వైద్యాధికారుల పర్యవేక్షణలో సిబ్బంది శానిటైజ్ చేస్తున్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో సీఎం కేసిఆర్ ఫామ్ హౌజ్ నుంచే తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తున్నా లాక్‌డౌన్‌పై పునరాలోచనలు జరుపుతోంది సర్కారు. లాక్డౌన్ శాశ్వత పరిష్కారం కాదని భావించిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం.
ఈ దశలో వారం రోజులుగా ఒక్కొక్కరిలో కొరోనా లక్షణాలు బయటపడుతుండడంతో పరీక్షలు నిర్వహించారు. కొంతమందికి లక్షణాలు లేకపోయినా టెస్టులు చేయించుకున్నారు. మొత్తంగా 20 మంది సిబ్బందికి పాజిటీవ్ అని తేలింది. వైరస్ సోకినవారిలో ఔట్ సోర్సింగ్, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. దీంతో వైద్యాధికారుల పర్యవేక్షణలో ప్రగతి భవన్‌ను అధికారులు శానిటైజ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కాలంలో ఎక్కువగా ఫామ్ హౌస్‌లోనే ఉంటున్నారు. ఇక నుంచి పూర్తిగా పామ్ హౌస్ నుంచి అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో ఎక్కువగా ఫామ్ హౌస్‌లోనే ఉంటున్నప్పటికీ అధికారిక సక్షలు మాత్రం ప్రగతి భవన్లో నిర్వహించేవారు. ఇటీవల కాలంలో కొరోనా కేసులు పెరిగిపోవడంతో ప్రెస్ ట్లు తగ్గించారు. గత మూడు రోజులుగా హైదరాబాద్‌లో లాక్ డౌన్ విధింపుపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చలు జరుపుతున్నారు. అయితే ఏ నిర్ణయానికి రాలేకపోయారు. తెలంగాణలో కొరోనా ప్రమాదకరంగా విస్తరిస్తోంది. హైదరాబాద్‌లోనే రోజుకు దాదాపుగా వెయ్యి కేసులు నమోదయ్యే పరిస్థితి నెలకొంది.