Take a fresh look at your lifestyle.

హోంమంత్రి మహమూద్ అలీకి కొరోనా పాజిటివ్

జిహెచ్ఎంసీ పరిధిలో కొరోనా విలయతాండవం చేస్తోంది. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల పరిధిలో పూర్తి లాక్‌డౌన్ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కొరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనను అపోలో హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు.
డాక్టర్ల పర్యవేక్షణలో హోంమంత్రికి వైద్యం అందిస్తున్నారు. మరోవైపు పోలీసులు అప్రమత్తం అయ్యారు. హోంమంత్రితో తిరిగిన వారిని క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. అలాగే హోంమంత్రి నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది శానిటైజర్ చేస్తున్నారు. హోంమంత్రి ఆరోగ్యంపై సహచర మంత్రులు వాకబు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

Leave a Reply