Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో 45,567 మందికి కొరోనా లక్షణాలు

  • అధికారులల్లో ఆందోళన
  • వర్క్‌ఫ్రమ్‌ ‌హోమ్‌లో చాలా మంది ఉద్యోగులు
  • చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌కు కొరోనా
  • తాంసి ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ ‌సహా ఆరుగరికొరోనా
  • బాధితులకు అవసరమైన ఆక్సిజన్‌ ‌సిద్ధంగా ఉందన్న మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, జనవరి 22 : కొరోనా కట్టడిలో భాగంగా ఇంటింటా జ్వర పరీక్ష నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఈ సర్వేలో ఇప్పటివరకు 45,567 మందికి కొరోనా లక్షణాలున్నట్టు అధికారులు గుర్తించారు. లక్షణాలున్న ప్రతిఒక్కరికీ హోమ్‌ ఐసొలేషన్‌ ‌కిట్స్‌ను అందజేశారు. సర్వేలో చిన్నారులు, పెద్దవారి వివరాలు విడివిడిగా సేకరిస్తున్నారు. ఎక్కువ శాతం పెద్దవారిలోనే కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. తీవ్ర కరోనా లక్షణాలుంటే వైద్య సిబ్బంది హాస్పిటల్‌లో అడ్మిట్‌ ‌చేస్తుంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ కొరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. వారం రోజులగా 3 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. అటు రాజకీయ పార్టీల నేతలు కూడా వైరస్‌ ‌బారిన పడుతున్నారు. దీంతో రాష్ట్రంలో నాయకుల హల్‌చల్‌ ‌తగ్గింది. వైరస్‌ ‌వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ ఆఫీస్‌కు తాళం వేశారు. కొరోనా కట్టడిలో భాగంగా ఏమైనా మీటింగ్స్ ఉన్నా…జూమ్‌ ‌ద్వారా నిర్వహిస్తున్నారు. అటు గాంధీభవన్‌కు కూడా కొత్తవారిని రానివ్వటం లేదు. అడపదడపా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన నేతలకు కొరోనా సోకి హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్నారు.

మరోవైపు బిఆర్కె భవన్‌లో వరుసగా అధికారులు కొరోనా బారిన పడుతుండటంతో… రోజు వొచ్చే ఆఫీసర్ల సంఖ్య కూడా తగ్గింది. చాలా వరకు సచివాలయ అధికారులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. స్వల్ప లక్షణాలు కనిపించినా…టెస్టులు చేయించుకుంటున్నారు. ఆఫీసులో పలువురికి కొరోనా సోకడంతో..ఆఫీసుకు వొచ్చేవారి సంఖ్య తగ్గింది. ఇప్పటి వరకు 670 మంది సిబ్బందికి కొరోనా పాజిటివ్‌ ‌వొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మేడ్చల్‌ ‌జిల్లాల పరిధిలో ఎక్కువగా కొరోనా కేసులు నమోదు అవుతున్నాయి. చాలా సెంటర్స్ ‌లో దాదాపు 30 శాతంపైగా పాజిటివిటీ రేట్‌ ‌వస్తోంది. అదిలాబాద్‌ ‌జిల్లాలో కరోనా కేసులు విజృంబిస్తున్నాయి. మహారాష్ట్ర సరిహద్దుని ఆనుకుని ఉన్న ఈ జిల్లాలో మొదటి నుంచి కేసుల పెరుగుదల భారీగానే ఉంది. అయితే గత కొద్ది రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్న ప్రచారంతో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగింది. ఎంతగా జరిమానాలు విధిస్తున్నా ప్రజలు మాస్కులు ధరించకుండా.. సోషల్‌ ‌డిస్టెన్స్ ‌పాటించకపోవడం వల్ల కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో తాంసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఒక డాక్టర్‌ ‌స్వల్ప అస్వస్థతకు గురికావడంతో అనుమానంతో పరీక్షలు చేయించుకున్నారు.

డాక్టర్‌ ‌కు కరోనా సోకినట్లు నిర్దారణ కావడంతో అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బంది అందరికీ పరీక్షలు చేయించగా.. ఆరుగురికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఇవాళ శనివారం ఆసుపత్రికి తాళం వేశారు. తాంసి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్‌ ‌సహా ఆరుగురికి కరోనా సోకడంతో ఆసుపత్రిలో వైద్య సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. డిస్‌ ఇన్‌ ‌ఫెక్షన్‌ ‌చేసేందుకు ఆసుపత్రి మొత్తం శానిటైజ్‌ ‌చేయడంతోపాటు పరిసరాలను శుభ్రం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఇకపోతే చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌కు కొరోనా నిర్దారణ అయింది. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ‌చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన మాస్కులు ధరించలేదు. లైట్‌ ‌తీసుకున్నట్లు వ్యవహరించారు. ఇవాళ అనుమానంతో పరీక్షలు చేయించుకోడా కొరోనా సోకినట్లు తేలింది.

ఇదిలావుంటే కొరోనా లక్షణాలు ఉన్నవారికి వెంటనే కోవిడ్‌ ‌కిట్‌ ‌ను అందజేస్తున్నామని మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొవిడ్‌ ‌నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పిల్లలు, పెద్దల కోసం ప్రత్యేక వార్డ్‌లు ఏర్పాటు చేశామన్న హరీష్‌.. ఇం‌దుకోసం కోటి హోం కిట్‌లు సిద్ధం చేశామన్నారు. 370 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ ‌రెడీగా ఉన్నాయని.. వైద్యుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. కరోనా కట్టడిలో భాగంగా ఇంటింటా జ్వర పరీక్ష నిర్వహించి, ప్రజలందరి ఆరోగ్య వివరాలను ఆరోగ్యశాఖ సేకరిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని మంత్రి హరీష్‌రావు సూచించారు. కొవిడ్‌ ‌నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ ‌తీసుకోవాలని మంత్రి హరీష్‌రావు సూచించారు.

Leave a Reply