Take a fresh look at your lifestyle.

తెలంగాణ స్పీకర్‌ ‌పోచారంకు కొరోనా పాజిటివ్‌

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాసరెడ్డి కొరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని గురువారం ఆయన తన ట్విట్టర్‌ అకౌంట్‌ ‌ద్వారా వెల్లడించారు. రెగ్యులర్‌ ‌మెడికల్‌ ‌టెస్టులలో భాగంగా బుధవారం రాత్రి చేయించిన కోవిడ్‌ ‌టెస్టులో తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందనీ, తెలిపారు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ వైద్యుల సూచనల మేరకు చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్‌లో చేరినట్లు తెలిపారు.

గత కొన్ని రోజులుగా తనను కలసిన, తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కోవిడ్‌ ‌టెస్టులు చేయించుకోవాలనీ, తగిన జాగ్రత్తలతో హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కాగా, నాలుగు రోజుల క్రితం స్పీకర్‌ ‌పోచారం మనవరాలి వివాహం ఘనంగా జరిపించారు. ఈ వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌ ‌హాజరైన విషయం తెలిసిందే.

Leave a Reply