ప్రైవేట్ దవాఖానాలో చికిత్సకు తరలింపు
హైదరాబాద్‌లో కేసులపై పుకార్లు షికార్లు
భాగ్యనగరంలో కొరోనా విలయతాండవం చేస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో పూర్తి లాక్డౌన్ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ •ంమంత్రి మహమూద్ అలీకి కొరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో •ంమంత్రికి వైద్యం అందిస్తున్నారు. ఆయన మనవడికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్దౄరణ అయ్యింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు బీగాల గణెళిశ్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలు యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నరాఉ. అలాగే కాంగ్రెస్ సీనియనరర్ నేత విహెచ్ కూడా ఆస్పత్రిలో చికిత్ పొందుతున్నారు. మరోవైపు కరోనా కేసలుతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. •ంమంత్రితో తిరిగిన వారిని క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. అలాగే •ంమంత్రి నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది శానిటైజర్ చేస్తున్నారు. •ంమంత్రి ఆరోగ్యంపై సహచర మంత్రులు వాకబు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. •ంమంత్రి ఆరోగ్యంపై సహచర మంత్రులు వాకబు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
మరోవైపు హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రతిరోజు 800 నుంచి 1000 వరకు కేసులు నమోదవుతున్నాయి. దాంతో నగర ప్రజలు గడపదాటాలంటేనే భయపడు తున్నారు. దాంతో కొంతమంది వ్యక్తులు కావాలనే ఫేక్ వార్తలు పుట్టిస్తున్నారు. అక్కడ కరోనా సోకింది.. ఇక్కడ కరోనా సోకింది.. అక్కడ అంతమంది చనిపోయారు.. ఇక్కడ ఇంతమంది చనిపోయారు అని లేనిపోని పుకార్లు పుట్టించి జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా బార్కస్ లో 10 కరోనా మృతదేహాలు, డబీర్ పురాలో 25 కరోనా మృతదేహాలు గుట్టుచప్పుడు కాకుండా కాల్చేశారని కొన్ని వార్తలు ఫేస్ బుక్, వాట్సాప్ మొదలైన సోషల్ డియా ఖాతాల్లో ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని పరిశీలించిన అధికారులు.. ఇవన్నీ ఫేక్ వార్తలని తేల్చారు. కరోనా వైరస్ విషయంలో ఫేక్ వార్తలు పుట్టించి.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసులు హెచ్చరించారు. ఇలాగే బెంగుళూరులో కూడా రెండు రోజుల క్రితం ఓ ఫేక్ వార్త అందరినీ కలవరపెట్టింది. సిటీలోని కొన్ని బేకరీలు, రెస్టారెంట్లకు సంబంధించిన ఉద్యోగులకు కరోనాసోకిందని వార్త పుట్టించారు. ఆ బేకరీలు, రెస్టారెంట్లు మరియు అవి ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉంటేనే మంచిదని ప్రచారం చేశారు. దాంతో బెంగుళూరు •టల్స్ అసోసియేషన్ నగర కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. సిటిలో ఏ •టల్ లేదా బేకరీ ఉద్యోగులకు కరోనా సోకలేదని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.