Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్సీ సతీశ్ కు కొరోనా పాజిటివ్‌.. శాసనమండలిలో కలకలం

తెలంగాణలో పెరుగుతున్న కొరోనా కేసులు

తెలంగాణలో కొరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 337 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కు కొరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తనకు కొరోనా సోకిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన స్వయంగా తెలియజేశారు. ర్యాపిడ్ టెస్టులో నెగెటివ్ రాగా… ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్ అని తేలిందని చెప్పారు.

గత ఐదు రోజులుగా తనతో ప్రైమరీ కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, హోమ్ ఐసొలేషన్ లో ఉండాలని ఆయన కోరారు.మరోవైపు పురాణం సతీశ్ కు కొరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే శాసనమండలి సభ్యుల్లో కలవరం మొదలైంది. శనివారం ఆయన మండలి సమావేశాలకు హాజరయ్యారు. దీంతో, ఆయనకు సన్నిహితంగా మెలిగిన వారందరూ కొరోనా టెస్టులు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Leave a Reply