Take a fresh look at your lifestyle.

కంటైన్‌మెంట్‌ ‌జోన్‌లో హరితహారం పాల్గొన్న నేతలకు కొరోనా పాజిటివ్‌ ‌కలవరం

తెలంగాణలో కొరోనా కలకలం రేపుతోంది. ప్రతిరోజు వెయ్యికి చేరువలో కేసులు నమోదవుతున్నాయి. నమోదైన కేసుల్లో 80శాతం కేసులవరకు జిహెచ్‌ఎం‌సి పరిధిలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు సాధారణ ప్రజలతో పాటు తెలంగాణాలో ఎక్కువగా ప్రజాప్రతినిధులు వైరస్‌ ‌బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కొరోనా బారిన పడి దవాఖానాల్లో• చేరారు. తాజాగా ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో పాల్గొన్న నేతలు కొరోనా బారిన పడినట్టు తెలుస్తోంది.

ఆరోవిడత హరితహారంలో భాగంగా సికింద్రాబాద్‌ ‌లోని ఓ కంటైన్మెంట్‌ ‌జోన్‌ ‌లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఆ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నేతలకు కరోనా పాజిటివ్‌ ‌వచ్చినట్టు తెలుస్తోంది. ఆ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మంత్రి తలసాని  శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌పాల్గొన్నారు. ఆయనతోపాటు ముఖ్యనేతలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే పలువురు బోర్డ్ ‌మెంబర్‌లు •మ్‌ ‌క్వారంటైన్‌ ‌లోకి వెళ్లిపోయారు.

Leave a Reply