Take a fresh look at your lifestyle.

ఏపీలో కొత్తగా 380 మందికి కొరోనా పాజిటివ్

రాష్ట్రంలో కొరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా అధికమవుతోంది. గడచిన 24 గంటల్లో 30,978 కొరోనా పరీక్షలు నిర్వహించగా, 380 మందికి కొరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 70 పాజిటివ్ కేసులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 60, కర్నూలు జిల్లాలో 51, కృష్ణా జిల్లాలో 44, విశాఖ జిల్లాలో 43 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా తూర్పు గోదావరి జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో 6, కడప జిల్లాలో 8 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 204 మంది కొరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మృతి చెందారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య మరింత అధికమైంది. చాల కాలం తర్వాత 2 వేలు దాటింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,083 మంది కొరోనా చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,93,366 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,84,094 మంది కొరోనా ప్రభావం నుంచి విముక్తులయ్యారు. మొత్తం కొరోనా మృతుల సంఖ్య 7,189కి చేరింది.

Leave a Reply