Take a fresh look at your lifestyle.

‌మరో 38 మందికి కొరోనా పాజిటివ్‌

  • జీహెచ్‌ఎం‌సి పరిధిలో 26, 10 మంది వలసదారులకు
  • మొత్తంగా 1699కి చేరిన కేసుల సంఖ్య, ఐదుగురి మృతి

రాష్ట్రంలో కొత్తగా 38 కొరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. గురువారం నిర్వహించిన పరీక్షలలో జీహెచ్‌ఎం‌సి పరిధిలో 26, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరికి, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి నిర్వహించిన పరీక్షలలో 10 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కొరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 1699కి చేరింది. ఈమేరకు గురువారం రాత్రి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ ‌బులెటిన్‌ ‌విడుదల చేశారు. గురువారం నిర్వహించిన పరీక్షలలో జీహెచ్‌ఎం‌సి పరిధిలో 26, రంగారెడ్డి జిల్లా 2, వలసదారులకు 10 మందికి వ్యాధి నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.

వైరస్‌ ‌కారణంగా 5 మంది మృతి చెందిననట్లు నిర్ధారించారు. ఈమేరకు ప్రస్తుతం రాష్ట్రంలో 618 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయనీ, ఇప్పటి వరకు రాష్ట్రానికి వచ్చిన వలసదారులకు 99 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. అలాగే, కొరోనా సోకి వైద్య చికిత్సలతో కోలుకుని 1036 మంది డిశ్చార్జి కాగా, ఈ వైరస్‌ ‌బారిన పడి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 45కు చేరిందని బులెటిన్‌లో తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!