Take a fresh look at your lifestyle.

ఎపిలో కొత్తగా 21,452 మందికి కరోనా పాజిటివ్‌

‌కరోనా బారిన పడి మరో 89 మంది మృత్యువాత
ఉల్లంఘనలకు పాల్పడ్డ 9 ఆస్పత్రులపై కేసులు
అమరావతి, :  గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 90,750 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 21,452 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 13,44,386 మందికి కరోనా వైరస్‌ ‌సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 89 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 8,988కు చేరింది. గడిచిన 24 గంటల్లో 19,095 మంది కోవిడ్‌ ‌నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 11 లక్షల 35 వేల 133 మంది డిశ్చార్జ్ అయ్యారు.  ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ ‌బులెటిన్‌ ‌విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 1,97,370 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో నేటి వరకు 1,76,05,687 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు ఉల్లంఘనలకు పాల్పడ్డ  ఏపీలో 9 ఆస్పత్రులపై క్రిమినల్‌ ‌కేసులు నమోదయ్యాయి. పలు ఆస్పత్రులపై విజిలెన్స్ అం‌డ్‌ ఎన్‌ ‌ఫోర్స్ ‌మెంట్‌ ‌సోదాలు చేసింది. పలు ఆస్పత్రుల్లో అవకతవకలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అధిక చార్జీలు, పేషెంట్ల సంఖ్యపై తప్పుడు సమాచారం, రెమ్‌ ‌డెసివిర్‌ ఇం‌జక్షన్ల దుర్వినియోగం, అనుమతి లేకుండా కోవిడ్‌ ‌చికిత్స వంటి అవకతవకలను గుర్తించినట్లు విజిలెన్స్ అం‌డ్‌ ఎన్‌ ‌ఫోర్స్ ‌మెంట్‌ అధికారులు పేర్కొన్నారు. చరిత్ర ఆస్పత్రి (ఏలూరు), ఆశా ఆస్పత్రి (అనంతపురం), ఎస్‌.ఆర్‌.ఆస్పత్రి (విశాఖపట్నం), ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి (బీమిలి), రమ్య ఆస్పత్రి (విశాఖపట్నం), అచ్యుత ఎన్‌ ‌క్లేవ్‌ (‌విజయవాడ), శ్రీరామ్‌ ఆస్పత్రి (విజయవాడ), విశ్వాస్‌ ఆస్పత్రి (గుంటూరు), డాక్టర్‌ ‌ప్రసాద్‌ ఆస్పత్రి (పీలేరు)లపై క్రిమినల్‌ ‌కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply