Take a fresh look at your lifestyle.

కొరోనా పాజిటివ్‌ ‌కుటుంబ సభ్యులకు భద్రత కల్పిస్తాం: హరీష్‌రావు

ఇటీవల డిల్లీ ఘటనలో కరోనా నిర్ధారణ పరీక్షలలో పాజిటివ్‌ ‌వచ్చిన వారి కుటుంబ సభ్యులందరికీ భద్రత కల్పిస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. గురువారం పటాన్‌చెరు మండలంలోని పాటి నారాయణ ఐఐటి అకాడమీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ ‌కేంద్రాన్ని ఆయన పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మైక్‌ ‌లో బాధిత కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. 43 మంది కుటుంబ సభ్యులను నేడు ఇక్కడకు తరలించామని, కేవలం పరీక్షల నిర్దారణ నిమిత్తం మాత్రమే వీరిని తీసుకుని వచ్చామని పేర్కొన్నారు.

పరీక్షల్లో నెగటివ్‌ ‌వస్తే వారందర్నీ విడిచి పెడతామని అంతవరకు క్వారంటైంలో ఉంచుతామని తెలిపారు. క్వారంటైన్‌ ‌సమయంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగిన తనకు ఫోన్‌ ‌చేయవచ్చని అన్నారు. ఆయన తన మొబైల్‌ ‌నెంబర్‌ ‌ను వారందరికీ మైక్‌ ‌ద్వారా తెలిపారు. మంత్రి వెంట ఎంపీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, కలెక్టర్‌ ‌హనుమంతరావు ఎస్పీ చంద్రశేఖర్‌ ‌రెడ్డి, ఆర్డీఓ నగేష్‌, ఎంఆర్‌ఓ ‌మహిపాల్‌ ‌రెడ్డి, డీఎస్పి రాజేశ్వరరావు, సీఐ రామిరెడ్డి, జిల్లా వైద్య శాఖ అధికారి రాథోడ్‌ ‌తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply