Take a fresh look at your lifestyle.

దేశవ్యాప్తంగా కొరోనా పాజిటివ్‌ ‌కేసులు.. 1,01,139

 24 గంటల్లో 4,970 కేసులు నమోదు 

దేశంలో కొరోనా వైరస్‌ ‌విజృంభణ వేగంగా కొనసాగుతోంది. భారత్‌లో ఇప్పటికే కోవిడ్‌ 19 ‌కేసులు లక్ష దాటాయి. గడిచిన 24గంటల్లో 4,970 కొత్త కేసులు, మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇండియాలో మొత్తం పాజిటివ్‌ ‌కేసులు 10,1139 చేరగా.. మరణాల సంఖ్య 3,163 కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 58వేల 802 కొరోనా యాక్టివ్‌ ‌కేసులున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ ‌బులిటెన్‌ ‌లో పేర్కొంది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి తో కోలుకుని 39,173మంది డిశ్చార్జ్ అయ్యారు. అటు మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 35,058 చేరింది. 1,249మంది కోవిడ్‌ ‌తో ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 11,760 పాజిటివ్‌ ‌కేసులు, 81 మరణాలు నమోదయ్యాయి. గుజరాత్‌ ‌లో 11,745 కోవిడ్‌ ‌బారిన పడగా, 694మంది చనిపోయారు. దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు 10వేలు దాటాయి. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసులు 1,00,54 నమోదు కాగా, 168మంది ఈ వైరస్‌ ‌తో మృత్యువాత పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా రాకాసి విలయతాండవం చేస్తోంది.తెలంగాణలో మరో 41 కరోనా పాజిటివ్‌ ‌కేసులు ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో సోమవారం మరో 41 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్‌ఎం‌సీ పరిధిలో 26, మేడ్చల్‌ ‌జిల్లాలో మూడు, వలసదారులకు సంబంధించి 12 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,592కి చేరుకుంది. అందులో వలసదారులు 69 మంది ఉన్నారు. సోమవారం 10 మంది కోలుకోగా, మొత్తం ఇప్పటివరకు 1,002 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు 34 మంది మృతి చెందగా, ప్రస్తుతం 556 మంది చికిత్స పొందుతున్నారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీ‌నివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన బులెటిన్‌ ‌విడుదల చేశారు.

ఇక గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాని జిల్లాలు 25 ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారిలో 663 మంది పురుషులు, 339 మహిళలున్నారు. ఇక డిశ్చార్జి అయినవారిలో 61 నుంచి 70 ఏళ్లవారు 60 మంది ఉండగా, 71 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న వారు 15 మంది ఉండటం విశేషమని శ్రీనివాసరావు పేర్కొన్నారు.ఇప్పటివరకు తెలంగాణలో 69 మంది వలస కూలీలకు కరోనా పాజిటివ్‌ ‌వచ్చింది. సోమవారం 10 మంది డిశ్చార్జ్ ‌కాగా ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,002 మంది డిశ్చార్జ్ అయ్యారు. 556 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనాతో ఇప్పటి వరకు 34 మంది చనిపోయినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ ‌బులెటిన్‌ను విడుదల చేసింది.ఎపిలో కొత్తగా 57 కరోనా వైరస్‌ ‌పాజిటివ్‌ ‌కేసులు ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 57 కరోనా వైరస్‌ ‌పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 2339కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్ ‌బులిటెన్‌ ‌విడుదల చేసింది. గత 24 గంటల్లో 9,739 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 57 మందికి పాజిటివ్‌ ‌నిర్దారణ అయిందని తెలిపింది. ఈ రోజు ఒక్కరోజే 69 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారని, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కోరి చొప్పున మృత్యువాత పడ్డారని పేర్కొంది. కాగా, ఇప్పటి వరకు 1596 మంది వైరస్‌ ‌బారినుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 691మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మొత్తం 52మంది మరణించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy