Take a fresh look at your lifestyle.

కొరోనా పాజిటివ్‌ ‌కేసులు వ్యాప్తి నివారణకు చర్యలు: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

  • లాక్‌డౌన్‌కు సహకరించాలి:డిజిపి
  • సూర్యాపేటలో ఉన్నత స్థాయి బృందం పర్యటన

సూర్యాపేట జిల్లాలో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లాలో ఎక్కువగా కొరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయిన నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ‌నేతృత్వంలో, డిజిపి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐజి ఇంటలిజెన్స్ ‌నవీన్‌ ‌చంద్‌, ఐజి వెస్ట్ ‌జోన్‌ ‌సిఫ్టెన్‌ ‌రవీంద్ర, డైరెక్టర్‌ ఆఫ్‌ ‌పబ్లిక్‌ ‌హెల్త్ శ్రీ‌నివాస్‌లతో కూడిన ఉన్నత స్థాయి బృందం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పర్యటించారు. జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం బజార్‌, ‌కూరగాయల మార్కెట్‌, ‌కంటెన్మెంట్‌ను పరిశీలించారు. కంటెన్మెంట్‌ ‌ప్రాంతాలలో చేపట్టిన చర్యలు జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌కృష్ణారెడ్డి, జిల్లా ఎస్పి ఆర్‌.‌భాస్కరన్లు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయం నందు జిల్లా కలెక్టర్‌, ఎస్పి, ఆర్డిఓలు, వైద్య, ఆరోగ్య శాఖల మెడికల్‌ ఆఫీసర్లు, మున్సిపల్‌ ‌కమిషనర్లతో, కంటెన్మెంట్‌ ‌స్పెషల్‌ ఆఫీసర్లతో సమావేశమై కరోనా పాజిటివ్‌ ‌కేసులు ఎక్కువగా నమోదు అయిన నేపధ్యంలో కారణాలు, కొత్తగా కేసులు నమోదు కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతు సూర్యాపేట జిల్లాలో 83పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు. జిల్లా జనాభ సుమారు 13లక్షలు ఉన్నందున గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌జనాభతో పోల్చితే సూర్యాపేట జిల్లాలో ఎక్కువ కేసులు నమోదు అయినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ ‌నియంత్రణకు అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ప్రజలు ఆందోళన చెందవొద్దని, జిల్లా యంత్రాంగం తీసుకునే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. కొత్త కేసులు నమోదు కాకుండా జిల్లా కలెక్టర్‌, ఎస్పిల నేతృత్వంలో అన్నీ శాఖలు కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. ఇప్పటీవరకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను అభినందిస్తు, యంత్రాంగం సహాకారంగా ఉండేందుకు ఐఏఎస్‌ అధికారి సర్పజ్‌ అహ్మద్‌ను ప్రత్యేక అధికారిగా నియమించినట్లు వెల్లడించారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని డిప్యూటి డిఎంహెచ్‌ఓను మున్సిపల్‌ ‌పరిపాలన డిప్యూటి డైరెక్టర్‌ను ఓఎస్డిగా నియమించినట్లు తెలిపారు. హెల్త్, ‌రెవెన్యూ, మున్సిపల్‌, ‌పోలీస్‌, ‌వ్యవసాయశాఖ, మార్కెటింగ్‌ ‌శాఖలు పనిచేస్తున్నారని , మెడికల్‌, ‌రెవెన్యూ, మున్సిపల్‌ ‌శాఖలు కీలకపాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా పాజిటివ్‌ ‌కేసుల కాంటాక్ట్ ‌చేదించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇటీవల వచ్చిన పాజిటివ్‌ ‌కేసుల నుండి మొదలుపెట్టి, పాత కేసులను రివ్యూ చేయాలన్నారు. ప్రతి ఒక్క కాంటాక్ట్ ‌చేజ్‌చేయడానికి పోలీస్‌, ‌హెల్త్, ‌మున్సిపల్‌ ‌శాఖలు సమన్వయంతో పనిచేసి టెక్నాలజీని వినియోగించుకోవాలని తెలిపారు. ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారిని క్వారంటైన్లకు తరలించి పరీక్షలు నిర్వహించాలని, ప్రైమరీ కాంటాక్ట్ ‌పరీక్షలు పూర్తిస్థాయిలో నిర్వహించాలన్నారు. పాజిటివ్‌ ‌వస్తే గాంధీకి తరలించాలని, నెగేటివ్‌ ‌వస్తే నిర్థిష్ట సమయంలో వారిని కార్వంటైన్లలో ఉంచి పూర్తిఅయిన తరువాత స్టాంపు వేయాలన్నారు. కంటెన్మెంట్‌ ‌ప్రాంతాల్లో మరింతగా పటిష్టం చేసి, ఆ ప్రాంతాల నుండి ప్రజలు బయటకు రాకుండా చూడాలని ఆదేశించారు. చీమకూడా లోనికి పోకూదు, బయటకు రావొద్దని ఆర్‌ అం‌డ్‌ ‌బి శాఖ భారీగేట్లతో పటిష్టం చేయాలన్నారు. కంటెన్మెంట్‌ ‌ప్రాంతాల్లో పబ్లిక్‌కు ఏనౌన్సిమెంట్‌ ‌చేయాలని తెలుగు, ఉర్దూ బాషల్లో ప్రచారాలు చేయాలని తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లఘిస్తే వారిని ప్రభుత్వ క్వారంటైన్లకు తరలించాలని ఆదేశించారు.ఆ ప్రాంతాలలో నిత్యవసర వస్తువుల సరఫరా, కూరగాయల సరఫరా పక్కగా అమలు కావాలన్నారు. సోడియం హైడ్రోక్లోరైడ్‌ ‌పిచికారి చేయాలని సూచించారు. అన్నీ వాణిజ్య సంస్థలు మూసివేయాలని తెలిపారు. క్వారంటైన్‌ ‌కేంద్రాలు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పారిశుద్ద్యం, ఆహారం, సామాజిక దూరం పాటించేటట్లు చూడాలని అన్నారు. ప్రైమరీ కాంటాక్ట్‌లో వారికి కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన నిబంధనలు అనుసరించి వైద్య పరీక్షలు, మందులు, ప్రోటోకాల్‌ ‌పాటించి రిపోర్టింగ్‌ ‌చేయాలని పేర్కొన్నారు. డైరెక్టర్‌ ‌పబ్లిక్‌ ‌హెల్త్ ఇక్కడే ఉండి మానిటరింగ్‌ ‌చేస్తారని అన్నారు.

అనంతరం డిజిపి మహేందర్‌రెడ్డి మాట్లాడుతు:
కరోనా పాజిటివ్‌ ‌కేసులు 83కు విస్తరించినట్లు, జిల్లా యంత్రాంగానికి దిశనిర్థేశం చేసి సమీక్షించేందుకు సిఎస్‌ ‌నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పంపినట్లు తెలిపారు. కరోనా మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జిల్లాలో కూడా చాలెంజ్‌గా తీసుకొని ఒక టీమ్‌గా పనిచేసి వంద శాతం కట్టడిచేయాలన్నారు. ప్రజలు సహకరిస్తూ, ప్రభుత్వ సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్‌ ‌శాఖ ద్వారా పూర్తి సహాకారం అందిస్తామన్నారు.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకూమారి మాట్లాడుతు క్వారంటైన్‌ ‌ప్రాంతాలలో వైద్య, ఆరోగ్య బృందాలు ప్రతి రోజు ఇంటింటి సర్వే చేసి, ఉదయం సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరికి మాస్క్‌లు అందజేయాలని అన్నారు. ప్రైవేట్‌, ‌ప్రభుత్వ ఆసుపత్రుల్లో జ్వరం పీడితులకు ప్రత్యేకంగా పరీక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని వెల్లడించారు. ప్రతి రోజు రిపోర్టింగ్‌ ‌చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్‌ఫెక్షన్‌ ‌నిరోద చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి, జిల్లా ఎస్పి భాస్కరన్లు జిల్లాలో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలను వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 83పాజిటివ్‌ ‌కేసులు వచ్చినట్లు, వీరిలో ఒకరు డిశ్చార్జి అయినట్లు వెల్లడించారు. 12కంటెన్మెంట్‌ ‌ప్రాంతాలు ఏర్పాటుచేసినట్లు, 7క్వారంటైన్‌ ‌కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు వివరించారు. వచ్చే వారం రోజుల్లో కరోనా కేసులు వ్యాప్తి చెందకుండా అన్నీ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ ‌డి. సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply