మరణాల సంఖ్యలోనూ పెరుగుదల, ప్రజల్లో ఆందోళన
దేశవ్యాప్తంగా కొరోనా కేసులలో గడచిన రెండు నెలలుగా మ్రంగా తగుదల కనిపించింది. అయితే రెండు రోజులుగా కేసుల్లో, మరణాల్లో పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నది. గురువారం మధ్యాహ్నం గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 45,892 కొరోనా కేసులు నమోదు కాగా, ఇదే సమయంలో 44,249 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 55 రోజుల తర్వాత కొరోనా నుంచి కోలుకున్న వారికన్నా కొత్తగా కొరోనా బారిన పడ్డ వారి సంఖ్య అత్యధికంగా నమోదయ్యింది. కాగా 24 గంటల్లో కొరోనా కారణంగా 817 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో 4.60 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలోని మొత్తం కేసులతో పోల్చిచూస్తే యాక్టివ్ కేసుల సంఖ్య 1.50 శాతంగా ఉంది.
దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 97.18 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు ఐదు శాతానికి దిగువగా నమోదవుతూ వొస్తుంది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 2.3 శాతంగా ఉంది. కాగా దేశంలో వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతంగా కొనసాగుతుంది. ఇదిలావుంటే కర్నాటక రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య గడిచిన 15 రోజులుగా తగ్గినా పది జిల్లాల్లో వరుసగా కేసుల సంఖ్య పెరుగుతుంది. 9 రాష్ట్రాల్లో కేసుల సంఖ్యలో క్రమంగా పెరుగుదల కనిపిస్తున్నది.