Take a fresh look at your lifestyle.

దేశంలో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు 1965

  • జమాతే ఉదంతం వల్లే 400 పాజిటివ్‌ ‌కేసులు
  • దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 50 మంది మృతి
  • కేంద్ర ఆరోగ్యశాఖ అధికారుల వెల్లడి
  • లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే జైలుకే అన్న కేంద్రం
  • గర్భిణిలకు అండగా ఢిల్లీ పోలీసుల సేవలు

దేశంలో ఇప్పటివరకు 1965 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. కరోనా నుంచి 151 మంది బాధితులు కోలుకున్నారు. ఢల్లీ మర్కజ్‌ ‌వచ్చిన వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ‌తమిళనాడు. పుదుచ్చేరి, అసోం, జమ్ముకశ్మీర్‌ ‌వాసులున్నారు. జమాతే ఉదంతం వల్లే 400 పాజిటివ్‌ ‌కేసులు వచ్చాయి. నిజాముద్దీన్‌ ‌మార్కజ్‌ ‌తర్వాత దేశవ్యాప్తంగా 9వేల మందిని క్వారంటైన్‌ ‌చేశామని తెలిపారు. మర్కజ్‌లో హాజరై అక్కడే ఉండిపోయిన వారిలో 1804 మందిని క్వారంటైన్‌ ‌చేశాం. ఐసోలేషన్‌, ‌కరోనా పరీక్షలపై దృష్టి సారించాలని ప్రధాని రాష్టాల్రకు సూచించారు.

గడిచిన 24 గంటల్లో 328 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా, 12 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో 50 మంది మృతి చెందారని తెలిపారు. మరోవైపు లాక్‌డౌన్‌ ‌నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు ఓ సర్క్యూలర్‌ను విడుదల చేసింది. లాక్‌డౌన్‌ ‌నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సిందిగా పేర్కొంటూ ఈ మేరకు రాష్టాల్రు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శాఖ కార్యదర్శి అజయ్‌ ‌భల్లా లేఖ రాశారు. ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఏ చర్య తీసుకోవాలో సవివరమైన నిబంధనల జాబితాను కేంద్రం రాష్టాల్రకు పంపింది. లాక్‌డౌన్‌ ‌నియమాలు ఉల్లంఘించిన వ్యక్తులు డిజాస్టర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌యాక్ట్- 2005‌లోని సెక్షన్‌ 51, 60 ‌ప్రకారం అదేవిధంగా ఐపీసీ సెక్షన్ల కింద శిక్షార్హులు అని పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ ‌వ్యాప్తి నివారణకు సామాజిక దూరం పాటించడమే ఒకే ఒక్క పరిష్కారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే లాక్‌డౌన్‌ ‌సందర్భంగా ఆస్పత్రులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న గర్భిణీలకు ఢిల్లీ పోలీసులు అండగా నిలుస్తున్నారు. ఎక్కడ ఎవరు ఆపదలో ఉన్నా సరే… హెల్ప్ ‌లైన్‌ ‌నంబర్‌కు ఫోన్‌ ‌చేయగానే వచ్చి వాలిపోతున్నారు. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఏప్రిల్‌ 1 ‌వరకు పురిటి నొప్పులు పడుతున్న దాదాపు 40 మంది గర్భిణీలను క్షేమంగా ఆస్పత్రులకు తరలించినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. వీరిలో 21 మందిని సప్దర్‌గంజ్‌ ఆస్పత్రికి తరలించగా… మరో ఏడుగురిని సంజయ్‌ ‌గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్‌కు వెళ్లిన పీసీఆర్‌ ‌వాహనాలనే పోలీసులు పేషెంట్లను తరలించేందుకు వినియోగించారు. కాగా లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో ఆపదలో ఉన్నవారికి సాయం అందించేందుకు వీలుగా ఢిల్లీ పోలీసులు ఓ హెల్ప్‌లైన్‌ ‌నంబర్‌ ఏర్పాటు చేశారు. కరోనా వైరస్‌ ‌లాక్‌డౌన్‌ ‌సందర్భంగా ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు 1.5 లక్షల మందికి భోజనం అందించారు. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే వారు మాకు 112 లేదా 23469526 హెల్ప్‌లైన్‌ ‌నంబర్లకు కాల్‌ ‌చేయవచ్చని ఢిల్లీ పోలీస్‌ ‌పీఆర్‌వో ఎంఎస్‌ ‌రంధావా పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply