Take a fresh look at your lifestyle.

మళ్లీ విజృంభిస్తున్న కొరోనా…

బుధవారం 22 వేల 854 పాజిటివ్ కేసులు
దేశంలో కొరోనా వైరస్ మరోసారి ఉగ్రరూపం దాల్చింది. కొన్ని రోజులుగా కొరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, గడిచిన 24 గంటల్లో వాటి సంఖ్య భారీగా పెరిగింది. రోజువారీ కేసుల సంఖ్య రెండు నెలల గరిష్ఠానికి చేరింది. బుధవారం(మార్చి 10,2021) రికార్డ్ స్థాయిలో 22వేల 854 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 126 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం కేసులు సంఖ్య 1,12,85,561కి చేరగా.. 1,58,189 మంది ప్రాణాలు వదిలారు. ఈ మేరకు గురువారం(మార్చి 11,2021) కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24గంటల్లో 7లక్షల 78వేల 416 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
Attachments area

Leave a Reply