Take a fresh look at your lifestyle.

విద్యార్థినిలకు పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యసిబ్బంది

ఆదర్శ పాఠశాలలో 12 మంది విద్యార్థులకు కొరోనా పాజిటివ్‌
‌తుర్కపల్లి, మార్చి19(ప్రజాతంత్ర విలేకరి) మండలంలోని రాంపూర్‌ ఆదర్శ పాఠశాలలో  (మోడల్‌ ‌స్కూల్‌) 12 ‌మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ ‌నిర్దారణ అయినట్లు వైద్య అధికారి డాక్టర్‌ ‌రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ శుక్రవారం 312 మంది విద్యార్థులకు కోవిడ్‌ ‌పరీక్షలు నిర్వహించగా 12 మందికి కరోనా పాజిటివ్‌ ‌వచ్చినట్లు తెలిపారు.

పాఠశాలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరి మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply