Take a fresh look at your lifestyle.

కేరళలో మరోమారు కరోనా పంజా

  • రికార్డు స్థాయిలో 22 వేలకు పైగా కేసులు నమోదు
  • కరోనా కారణంగా 131 మంది మృతి
  • వారాంతపు లాక్‌డౌన్‌ ‌ప్రకటించిన ప్రభుత్వం

తిరువనంతపురం,జూలై 29 : కేరళలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. కేరళలో బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 22 వేల 56 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 33 లక్షల 27 వేలు దాటింది. ఇక మరణాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. కేరళలో కరోనా కారణంగా 131 మంది చనిపోయారు. కేసుల పెరుగుదలతో అప్రమత్తమైన కేరళ సర్కార్‌…..‌వచ్చే శని,ఆదివారాలు పూర్తి లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన బృందాన్ని కేరళకు పంపిస్తుందన్నారు కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ ‌మాండవ్య. ఈ టీంకు నేషనల్‌ ‌సెంటర్‌ ఆఫ్‌ ‌డిసీజ్‌ ‌కంట్రోల్‌ ‌డైరెక్టర్‌ ‌నేతృత్వం వహించనున్నారు. మలప్పురం, త్రిస్సూర్‌,‌కోజికోడ్‌, ఎర్నాకుళం, పాలక్కడ్‌, ‌కొల్లాం, అలప్పుజా, కన్నూర్‌, ‌తిరువనంతపురం, కొట్టాయం జిల్లాల్లో వైరస్‌ ‌తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 4 లక్షల 46 వేల మంది వివిధ జిల్లాల్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. కేరళలో కరోనా కంట్రోల్‌ ‌కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ టీం సహకారం అందించనుంది.

కేరళ సర్కార్‌ ‌కు లేఖ రాశారు కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ ‌భూషణ్‌. ఇటీవల సూపర్‌ ‌స్పెడ్రర్‌ ఈవెంట్స్ ‌కు అనుమతి ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. కోవిడ్‌ ‌నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని లేఖలో స్పష్టం చేశారు. భారత్‌లో ఈశాన్య రాష్టాల్రతో పాటు కేరళలో కరోనా వైరస్‌ ‌వ్యాప్తి విస్తృతంగా ఉంది. మిగతా రాష్ట్రాల్లో రోజువారీగా వందల సంఖ్యలో కేసులు నమోదవుతుంటే కేరళలో నిత్యం 10 వేలకు పైగానే కేసులు బయటపడుతున్నాయి. కేరళలో కొవిడ్‌ ‌పరిస్థితులు చేజారిపోయినట్లు కనిపిస్తున్నాయని ఆరోగ్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్‌ ‌తీవ్రతకు వణికిపోయిన మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గింది. కేరళలో ఇంకా 10 శాతానికిపైగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో 40 శాతం ఒక్క కేరళలోనే ఉంటున్నాయి.

గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 22 వేల పాజిటివ్‌ ‌కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. మరోవైపు.. కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌పంపిణీలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళ వేగంగా అందిస్తోంది. అక్కడ 18 ఏళ్ల వయసున్న జనాభాలో 21 శాతం మందికి రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ అం‌దించింది. దేశ సరాసరి 9.9 శాతం ఉండగా కేరళ అంతకుమించి పంపిణీ చేసింది. ఐసీఎంఆర్‌ ‌జాతీయ స్థాయిలో నిర్వహించిన సీరో సర్వేలో దేశవ్యాప్తంగా సరాసరిగా 67.6 శాతం మందిలో యాంటీబాడీలు ఉంటే, కేరళలో మాత్రం 42.7 శాతం మాత్రమే ఉన్నాయి. దీంతో మరో 48 శాతం కేరళ ప్రజలకు వైరస్‌ ‌ముప్పు పొంచివుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కొవిడ్‌ ‌పాజిటివిటీ రేటు 5 శాతానికన్నా తక్కువగానే నమోదవుతోంది.

కేరళలో మాత్రం గడిచిన 6 వారాలుగా 10 నుంచి 12 శాతం రికార్డవుతోంది. నిత్యం 10 నుంచి 15 వేల మందిలో వైరస్‌ ‌బయటపడుతోంది. ఆస్పత్రిలో చేరికలు మాత్రం కాస్త తగ్గాయి. రాష్ట్రంలో భారీ స్థాయిలో కొవిడ్‌ ‌నిర్దారణ పరీక్షలు జరుపుతుండటంతోనే పాజిటివ్‌ ‌కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ సర్కార్‌ అ‌ప్రమత్తం అవుతోంది.. గత వారం వీకెండ్‌లో రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేసిన ప్రభుత్వం.. ఈ వారంలో కూడా పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ ‌ప్రకటించింది.. శని, ఆదివారాల్లో అంటే ఈ నెల 31, ఆగస్టు 1వ తేదీ.. ఇలా రెండు రోజుల పాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని వెల్లడించింది.

Leave a Reply