అధ్యయనం చేస్తున్నాం : డబ్ల్యూహెచ్వో
ప్రపంచవ్యాప్తంగా కొరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న వార్తలు ఇప్పుడు కలవరం కలిగిస్తున్నాయి. అయితే దీనిపై పరిశీలన చేసి ప్రకటన చేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరిన్ని సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. కొరోనా గాలిలో సైతం వ్యాప్తి చెందుతుందని కొందరు శాస్త్రవేత్తలు డబ్ల్యూహెచ్ఓకు తెలిపారు. దాంతో గాలిలో వైరస్ వ్యాప్తిపై తాజాగా డబ్ల్యూహెచ్ఓ హెడ్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రెసెస్ స్పందించారు.
గాలిలో వైరస్ వ్యాప్తి చెందుతుందా లేదా అన్నది త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. వైరస్ గాలిలో 2టర్ల దూరం వరకు ప్రయాణిస్తుందని, అయితే అంతకంటే ఎక్కువదూరం ప్రయాణిస్తుందని శాస్త్రవేత్తల బృందం లేఖ రాసిందని అన్నారు. దానిపైన అధ్యయనం చేస్తున్నామని, త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. అంతేకాకుండా ఈ వారాంతంలో 4 లక్షల కేసులు బయటపడ్డాయని అన్నారు. ఇప్పట్లో వైరస్ వ్యాప్తి తగ్గేలా కనిపించట్లేదని స్పష్టం చేసారు. కొరోనా తన చేతిలో ప్రపంచాన్ని బందీగా చేసిందని టెడ్రోస్ వ్యాఖ్యానించారు. కొరోనా పురుడు పోసుకున్న చైనాలో వైరస్ వ్యాప్తితగ్గినప్పటికీ ఇతర దేశాలపై ప్రభావం చూపుతుంది. ఒకదేశానికి మించి మరొక దేశంలో కేసులు నమోదవుతున్నాయి.