Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో నిలకడగా కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో 858 మందికి పాజిటివ్‌..9 ‌మంది మృతి
రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. 24 గంటల్లో కొత్తగా 858 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్‌ ‌నుంచి 1175 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా 9 మంది మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 107 కేసులు నమోదవగా, ఖమ్మం జిల్లాలో 81 కేసులు, నల్లగొండ జిల్లాలో 64 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,25,237 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,678కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,08,833 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 12,726గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply