Take a fresh look at your lifestyle.

దేశంలో మళ్లీ పెరిగిన కొరోనా కొత్త కేసులు 24 గంటల్లో తాజాగా 42,625 కేసుల నమోదు

న్యూదిల్లీ, ఆగస్ట్ 4 : దేశంలో కొరోనా కొత్త కేసులు ఒక్కరోజే మళ్లీ  పెరిగాయి. సోమవారం 30 వేలకు చేరవలో ఉన్న కేసులు తాజాగా మంగళవారం 42 వేలు దాటాయి. దేశంలో కొరోనా కేసులు స్వల్పంగా పెరిగాయని, 24 గంటల్లో దేశంలో కొత్తగా 42,625 కొరోనా కొత్త కేసులు నమోదు కాగా, 562 మంది కొరోనాతో మృతి చెందారని కేంద్రం తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం కొరోనా కేసుల సంఖ్య 3,17,69,132కి చేరింది. కొరోనాతో మొత్తం 4,25,757 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి మరో 36,668 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,10,353 యాక్టివ్‌ ‌కేసులు ఉండగా, 3.09 కోట్ల మంది రికవరీ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 48.52 కోట్ల మందికి టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన హెల్త్ ‌బులిటెన్‌ ‌లో వెల్లడించింది.

గడిచిన 24 గంటల్లో 42,625 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 3,17,69,132 కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 97.37శాతంగా ఉందని, మొత్తం కేసుల్లో యాక్టివ్‌ ‌కేసులు 1.29శాతం ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.31శాతంగా ఉందని తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు 47.31 కోట్ల కోవిడ్‌ ‌పరీక్షలు నిర్వహించామని, టీకా డ్రైవ్‌లో భాగంగా మొత్తం 48,52,86,570 టీకా డోసులు పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

Leave a Reply