Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో పెరిగిన కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో కొత్తగా 691 మందికి పాజిటివ్‌..ఐదుగురు మృతి
రాష్ట్రంలో రోజువారి కొరోనా కొత్త కేసులు కొంత పెరిగాయి. మంగళవారం 657 పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 691 కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్‌ ‌నుంచి 704 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా ఐదుగురు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 85 కేసులు నమోదవగా, ఖమ్మం జిల్లాలో 56 కేసులు, కరీంనగర్‌ ‌జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,38,721 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,771కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,25,042 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 9,908గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply