Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో తగుతున్న కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో 917 మందికి పాజిటివ్‌..10 ‌మంది మృతి
రాష్ట్రంలో కొరోనా కొత్త కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 917 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్‌ ‌నుంచి 1006 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా మంది మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 108 కేసులు నమోదవగా, నల్లగొండ జిల్లాలో 71 కేసులు, కరీంనగర్‌ ‌జిల్లాలో 66 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,23,510 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,661కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,06,461 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 13,388గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply