Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో స్వల్పంగా తగ్గిన కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో కొత్తగా 582 మందికి పాజిటివ్‌..‌ముగ్గురు మృతి
రాష్ట్రంలో రోజువారి కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 582 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్‌ ‌నుంచి 638 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా ముగ్గురు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 83 కేసులు నమోదవగా, కరీంనగర్‌, ‌వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లాలలో 61 కేసులు, ఖమ్మం జిల్లాలో 45 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,47,811 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,817కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,35,250 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 8,744గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply