Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో భారీగా తగ్గిన కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో కొత్తగా 245 మందికి పాజిటివ్‌..ఒక్కరు మృతి
రాష్ట్రంలో రోజువారి కొరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 245 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్‌ ‌నుంచి 582 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా ఒక్కరు మృతి చెందారు.

జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 52 కేసులు నమోదవగా, కరీంనగర్‌ ‌జిల్లాలో 30 కేసులు, నల్లగొండ జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,52,380 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,842కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,41,270 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 7,268గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply