Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో నిలకడగా కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో 987 మందికి పాజిటివ్‌..7‌గురు మృతి
రాష్ట్రంలో నిలకడగానే కొరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 987 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్‌ ‌నుంచి 1362 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా 7గురు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 130 కేసులు నమోదవగా, ఖమ్మం జిల్లాలో 102 కేసులు, నల్లగొండ జిల్లాలో 69 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,22,593 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,651కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,05,455 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 13,487గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply