Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో నిలకడగా కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో కొత్తగా 715 మందికి పాజిటివ్‌..‌నలుగురు మృతి
రాష్ట్రంలో కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 715 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్‌ ‌నుంచి 784 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా నలుగురు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 76 కేసులు నమోదవగా, ఖమ్మం జిల్లాలో 68 కేసులు, నల్లగొండ జిల్లాలో 54 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,35,320 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,751కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,21,541 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 10,028గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply