Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో నిలకడగా కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో కొత్తగా 696 మందికి పాజిటివ్‌..6 ‌గురు మృతి
రాష్ట్రంలో కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 696 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్‌ ‌నుంచి 858 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా 6 గురు మృతి చెందారు. ఖమ్మం జిల్లాలో కొత్తగా 82 కేసులు నమోదవగా, జిహెచ్‌ఎం‌సి పరిధిలో 68 కేసులు, నల్లగొండ జిల్లాలో 49 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,32,379 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,735కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,18,496 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 10,148గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply