Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో నిలకడగా కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో కొత్తగా 772 మందికి పాజిటివ్‌..7 ‌గురు మృతి
రాష్ట్రంలో బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. మంగళవారం 784 మందికి పాజిటివ్‌ ‌నమోదు కాగా బుధవారం కొత్తగా 772 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్‌ ‌నుంచి 748 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా 7 గురు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 88 కేసులు నమోదవగా, ఖమ్మంలో 86, నల్లగొండ జిల్లాలో 57 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,29,054 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,710కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,13,872 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 11,472గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply