Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో నిలకడగా కొరోనా కొత్త కేసులు

తాజాగా 202 మందికి పాజిటివ్‌..ఒక్కరు మృతి
రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 202 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్‌ ‌నుంచి 190 మంది కోలుకున్నారు. కాగా వైరస్‌ ‌కారణంగా ఒక్కరు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 52 కేసులు నమోదవగా, కరీంనగర్‌ ‌జిల్లాలో 19 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,69,365 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,941కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,61,484 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 3,940గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply