Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో నిలకడగా కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో కొత్తగా 255 మందికి పాజిటివ్‌..ఒక్కరు మృతి
రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 255 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్‌ ‌నుంచి 329 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా ఒక్కరు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 70 కేసులు నమోదవగా, ఖమ్మం జిల్లాలో 22 కేసులు, కరీంనగర్‌ ‌జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,63,281 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,903కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,54,230 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 5,148గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply