24 గంటల్లో కొత్తగా 609 మందికి పాజిటివ్.. నలుగురు మృతి
రాష్ట్రంలో రోజువారి కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 609 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్ నుంచి 647 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా నలుగురు మృతి చెందారు. జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 81 కేసులు నమోదవగా, కరీంనగర్ జిల్లాలో 67 కేసులు, ఖమ్మం జిల్లాలో 51 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,46,606 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,811కి చేరుకుంది.
ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,34,018 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 8,777గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.