Take a fresh look at your lifestyle.

కొరోనా నిర్లక్ష్యం ..పాలకుల వైఫల్యం ..!

తుఫాను వేగంతో కొరోనా మహమ్మారి మనుషులను మాయం చేస్తున్నది. ప్రభుత్వ, ప్రయివేటు హాస్పిటల్స్  ‌కొరోనా బాధితులతో నిండిపోయాయి. బెడ్స్ ‌దొరకడం లేదు. ప్రాణాలు నిలుపుతాయంటున్న రెమిడేసివర్‌ ఇం‌జక్షన్‌ ‌లు దొరకడం లేదు. ఆఖరుకు  ఆక్సిజన్‌ అం‌దక ఊపిరి తీసుకోవడం కోసం నరకయాతన పడుతున్నారు. కళ్ళముందే ప్రాణాలు కోల్పోతున్న వారి కుటుంబ సభ్యుల మనోవేదన పట్టించుకునే నాధుడే లేడు. ఈ పరిస్థితి చూస్తున్న వారు తమకూ  ఈ పరిస్థితి రాకుండా చూసుకునేందుకు వ్యాక్సిన్ల కోసం పరుగు పెడుతున్నారు. అక్కడా అర కిలోమీటరు మేర క్యూ ఉంటోంది. తమ వంతు వచ్చేవరకు వ్యాక్సిన్‌ ‌స్టాక్‌ ఉం‌టుందో…లేదోననే బెంగ తప్పడం లేదు. ఈ పరిస్థితికి కారకులు ప్రజలేనా… పాలకులది కాదా…. చేష్టలుడిగి చోద్యం చూస్తున్న ప్రభుత్వ యంత్రాంగం ది కాదా…

ఈ భూమిమీదికి ఒంటరిగానే వచ్చాం.. అలాగే చనిపోయాక ఒంటరిగానే పోతాం.. కానీ మధ్యలో ఏర్పడిన బంధాలు, అనుబంధాలు మాత్రం పదికాలాల పాటు ఉంటాయి. వీటిని తెంచుకుని పోయే సమయం ఆసన్నం అయినప్పుడు మనిషి పడే వేదన, బాధ మాటల్లో చెప్పలేనిది. కొరోనా మహమ్మారి బారిన పడిన వారు, వారి కుటుంబ సభ్యుల ఆందోళన చూస్తుంటే హృదయం ద్రవిస్తుంది. ఈ పరిస్థితికి ప్రజల నిర్లక్ష్యం కొంత కారణం అయితే… మిగతాదంతా పాలకులదే..కంటికి కనిపించని సూక్ష్మ జీవి కొరోనా వైరస్‌ ‌గతేడాది మన దేశంలో మొదటిసారిగా  బయట పడినప్పుడు ప్రజలు భయపడ్డారు. ప్రభుత్వాలు చెప్పింది విన్నారు. చేయమన్నది చేశారు. లాక్‌ ‌డౌన్‌ ‌పెడితే ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఉన్నారు. దీపాలు వెలిగించి గిన్నెలు కొట్టమంటే కొట్టారు. కొరోనా బారిన పడిన వారిని వారి కుటుంబీకులు హాస్పిటల్స్ ‌ల్లో  చేర్చారు. ఇంట్లో కూర్చునే…దేవుళ్ళకు మొక్కుకున్నారు. అదృష్టం ఉన్న వారు బతికి ఇళ్లకు వచ్చారు. చనిపోయిన వారిని కుటుంబ సభ్యులు సైతం చివరి చూపులకూ నోచుకోని దైన్యాన్ని చూసి…భగవాన్‌ ‌పగ వాడికి కూడా ఈ పరిస్థితి రావద్దు అని మొక్కుకున్నారు.

ఏడాది తర్వాత ఇప్పుడు కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌మళ్లీ విజృంభిస్తున్నది. ఆనాటి పరిస్థితి ఇప్పుడూ ఉంది. కాకపోతే కొంత మార్పు ఉంది. అప్పుడంటే .. కొరోనా మనకు కొత్త రోగం. దాన్ని హ్యాండిల్‌ ‌చేయడంలో అనుభవం లేదు. మరి ఈ ఏడాది సమయం ఏమి చేశారు అన్న ప్రశ్నకు పాలకులు సమాధానం చెప్పాలి.తుఫాను వేగంతో కొరోనా మహమ్మారి మనుషులను మాయం చేస్తున్నది. ప్రభుత్వ, ప్రయివేటు హాస్పిటల్స్  ‌కొరోనా బాధితులతో నిండిపోయాయి. బెడ్స్ ‌దొరకడం లేదు. ప్రాణాలు నిలుపుతాయంటున్న రెమిడేసివర్‌ ఇం‌జక్షన్‌ ‌లు దొరకడం లేదు. ఆఖరుకు  ఆక్సిజన్‌ అం‌దక ఊపిరి తీసుకోవడం కోసం నరకయాతన పడుతున్నారు. కళ్ళముందే ప్రాణాలు కోల్పోతున్న వారి కుటుంబ సభ్యుల మనోవేదన పట్టించుకునే నాధుడే లేడు. ఈ పరిస్థితి చూస్తున్న వారు తమకూ  ఈ పరిస్థితి రాకుండా చూసుకునేందుకు వ్యాక్సిన్ల కోసం పరుగు పెడుతున్నారు. అక్కడా అర కిలోమీటరు మేర క్యూ ఉంటోంది. తమ వంతు వచ్చేవరకు వ్యాక్సిన్‌ ‌స్టాక్‌ ఉం‌టుందో…లేదోననే బెంగ తప్పడం లేదు. ఈ పరిస్థితికి కారకులు ప్రజలేనా… పాలకులది కాదా…. చేష్టలుడిగి చోద్యం చూస్తున్న ప్రభుత్వ యంత్రాంగం ది కాదా…

ఓట్ల కోసం అన్నా..అక్కా అంటూ వరుసలు కలుపుతూ వచ్చిన రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒక్కరు కూడా తమ కష్టాన్ని చూసి దగ్గరకు రావడం లేదని సాధారణ ప్రజలు వాపోతున్నారు.  వాస్తవానికి కష్టాల్లో ఉన్న ప్రజలని ఓదార్చి, ధైర్యం చెప్పే ప్రయత్నం ఏ ఒక్క నాయకుడు చేయలేకపోతున్నాడు.. దీనికి కారణం  తమకూ కొరోనా వైరస్‌ ‌సోకితే ప్రాణాలు ఎక్కడ పోతాయేమో..అన్న భయమే. అప్పోసప్పో చేసి ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న పేదలు ఆవేశంతో రగిలిపోతున్నారు. పన్నుల రూపంలో తాము చెల్లించిన డబ్బులతోనే ప్రభుత్వాలు వివిధ పథకాల పేరిట ఖర్చు చేసుకుంటూ మనుగడ సాగిస్తున్నాయి…కానీ.. ఈ ఆపత్కాలంలో వైద్య ఖర్చులు తామే భరిస్తామని  చెప్పడం ఆవేదనగా చెప్తున్నారు.

ప్రజల నిర్లక్ష్యం వల్లనే కొరోనా  సెకండ్‌ ‌వేవ్‌ ‌వచ్చిందని  ప్రభుత్వాలు చెబుతున్న మాటల్లో కొంతమేర వాస్తవం ఉన్నప్పటికీ ప్రభుత్వాల నిర్ణయాలు, నిర్లక్ష్య ధోరణి వల్లే వైరస్‌ ‌వ్యాప్తికి కారణం.కొరోనా పూర్తిగా పొకముందే  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇతర రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలు, కొన్ని చోట్ల ఉప ఎన్నికలు జరిపారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ ‌సహా ఇతర పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఈ ఎన్నికల సమరంలో ఓటర్లను ఆకర్షించేందుకు మీటింగ్‌ ‌ల మీద మీటింగ్‌ ‌పెట్టారు. దాని ఫలితమే ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు పెరుగుతుండడం.  సాక్షాత్తు ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులతో పాటు కేంద్ర మంత్రులు సైతం కొరోనా బారిన పడ్డారు. దీనికితోడు కుంభమేలా  కు కేంద్రం  అనుమతి ఇచ్చి ఉండాల్సింది కాదు. 31 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన చోట కోవిడ్‌ ‌నిబంధనలు ఎలా అమలవుతాయనీ కేంద్రం ఆలోచించలేదు. ఇప్పుడు కుంభమేలాకు వెళ్లొచ్చిన వారిలో వేల మంది కొరోనా పాజిటివ్‌ ‌గా తేలారు. వీరు నుంచి మరి కొన్ని వేల మందికి వైరస్‌ ‌సోకే ప్రమాదం ఉంది.

తుఫానులా విస్తరిస్తున్న  కొరోనా   కట్టడి కోసం ప్రపంచదేశాలు మందులు , వ్యాక్సిన్‌ ‌తయారీ కోసం చేస్తున్న పరిశోధనలకు ఆయా ప్రభుత్వాలు చేయూతను ఇచ్చాయి. కానీ మన దేశంలో దానికి భిన్నంగా పరిస్థితి ఉండడమే ప్రస్తుత దైన్య స్థితికి కారణం. ఏడాది కిందటే మేల్కొని ఉంటే కనీసం మన అవసరాలకు అవసరం అయిన వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేసుకుని ఉండే వాళ్ళం.  సరైన కార్యాచరణ లేకనే ఈ పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్‌ ‌పక్కనే శామీర్‌ ‌పేట లో ఉన్న భారత్‌ ‌బయోటెక్‌ ‌సంస్థ అనే వ్యాక్సిన్‌ ‌పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. అలాగే మహారాష్ట్ర లోని పూణే కేంద్రంగా పనిచేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇం‌డియా కోవీ షీల్డ్ ‌వాక్సిన్‌ ‌ని తయారు చేస్తోంది. ఈ రెండు మన ఇండియాలో తయారవుతున్నవే.  హైదరాబాద్‌ ‌కు చెందిన రెడ్డీస్‌ ‌ల్యాబ్స్  ‌రష్యాతో స్పుత్నిక్‌ ‌వి వ్యాక్సిన్‌ ‌తయారీకి ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ప్రస్తుత డిమాండ్‌ ‌ను ఇప్పట్లో తీర్చేలా లేవు.
భారత్‌ ‌బయోటెక్‌ ‌వాక్సిన్‌ ‌వాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యం నెలకు ఒక కోటి 20 లక్షల డోసులు మాత్రమే. అలాగే సీరం ఇన్స్టిట్యూట్‌ ‌కోవీషీల్డ్ ‌తయారు చేసేది నెలకు ఆరుకోట్ల డోసులు మాత్రమే. ఈ రెండూ కలిపితే నెలకు ఏడు కోట్ల 20 లక్షల డోసులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. 135 కోట్ల జనాభా కలిగిన ఇండియాకు ఈ వ్యాక్సిన్‌ ‌లు ఎలా సరిపోతాయి.. ఎప్పటిలోగా అందరికీ వ్యాక్సినేషన్‌ ‌పూర్తవుతుందో ప్రభుత్వాలు చెప్పాల్సి ఉంది. అమెరికా లాంటి దేశాలు ఏడాది కిందటే వ్యాక్సిన్లు తయారుచేసే కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చాయి. పరిస్థితి చేయి దాటి పోయిన తర్వాత మన దగ్గర కొన్ని సంస్థలకు ఇప్పుడు కేంద్రం ఆఘమేఘాల మీద అనుమతి ఇవ్వడం గమనార్హం.

కొరోనా కట్టడిలో ఇండియా ప్రపంచానికే దిక్సూచిలా మారిందని వ్యాక్సిన్లను మనమే ప్రపంచానికి అందిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ గర్వంగా చెప్పారు. నిజంగానే ప్రతి భారతీయుడు ఈ విషయం పట్ల సంతోషంగా ఫీల్‌ అయ్యారు కూడా. కానీ కానీ మనదేశంలో తయారైన కోవాగ్జిన్‌, ‌కోవిషీల్డ్ ‌వ్యాక్సిన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. సాధారణంగా మన అవసరాలు తీరాకే మన  ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు  దీనికి భిన్నంగా ప్రధాని మోడీ నిర్ణయం  తీసుకున్నారు.ఊహించని విధంగా  కొరోనా   సెకండ్‌ ‌వేవ్‌ ‌విజృంభించడంతో ఏమి చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో కి పడిపోయారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను  పాజిటివ్‌ ‌రేట్‌ ఆధారంగా పంపిణీ చేయాల్సిన కేంద్రం తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేసులతో సంబంధం లేకుండా ఎక్కువ మొత్తంలో వాక్సీన్లనూ సరఫరా చేసింది. ఇదేమి వివక్ష అంటూ మిగతా రాష్ట్రాలు గగ్గోలు పెట్టినా…కేంద్రం పట్టించుకోలేదు. వ్యాక్సిన్‌ ‌ల కోసం రాష్ట్రాలు చేస్తున్న రిక్వెస్ట్ ‌లుకు తోడు అందరి చూపూ కేంద్రం వైపు ఉండడంతో పరిస్థితి ఇలాగే ఉంటే అప్రతిష్టపాలు అవుతామని భావించిన కేంద్ర ప్రభుత్వం మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌వేసింది.  వ్యాక్సిన్లు తయారు చేస్తున్న కంపెనీలు, సంస్థలు కేంద్రంకు 50 శాతం సరఫరా చేసి, మిగతా 50 శాతం వాక్సీన్లను  రాష్ట్రాలకు, కోరిన హాస్పిటల్స్ ‌కు  విక్రయించు కోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అవసరం అయితే రాష్ట్రాలే ఆక్సిజన్‌ ‌ప్లాంట్లకు అనుమతి ఇచ్చికోవచ్చని ప్రకటించింది.  మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్లు ఇస్తామని ప్రకటించింది. అంటే  ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ‌వేయించడం తమ బాధ్యత కాదని స్పష్టం చేస్తూ ఆ పనిని రాష్ట్రాలపై నెట్టేసింది. ఇపుడు  కొరోనా   కేసులు పెరిగినా, బాధితులు చనిపోయినా…అది రాష్ట్రాల ఖాతాలో చేరతాయన్న మాట.

కేంద్ర బడ్జెట్‌ 35 ‌లక్షల కోట్లు. 70 వేల కోట్ల వ్యాక్సిన్లను కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు 2 శాతం లోపే.  గత ఏడాది సెప్టెంబర్లో ఉండగానే కార్పొరేట్‌ ‌సంస్థలకు 1.45 లక్షల కోట్ల రూపాయల నిధులను కేంద్రం ఇచ్చింది అందులో సగం ఆపేసిన దేశ ప్రజలందరికీ ఉచితంగానే వ్యాక్సిన్లు వేసే అవకాశం ఇప్పుడు కలిగేది అంతేకాకుండా నెలకు జీఎస్టీ వసూలు 1.20 లక్షల కోట్లు ఇందులో సగం డబ్బు కోసం కేంద్రం ఖర్చు చేయలేదు ఎందుకు ఈ ఆలోచన చేయడం లేదన్నది జవాబు లేని ప్రశ్న.
ఇప్పుడు 45 ఏళ్ళ పైబడిన వారికి ఇస్తున్న వ్యాక్సిన్లు సరిగా అందని పరిస్థితి ఉండగానే.. మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్లు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారనేది ప్రధాని మోడీ  ప్రకటించలేదు.  డిమాండ్‌ ‌మేరకు వాక్సీన్ల ఉత్పత్తి  లేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో 18 ఏళ్ల పైబడిన వారికి ఎలా వ్యాక్సిన్లు సప్లై చేస్తారు చెప్పాల్సి ఉంది.చేసేదంతా చేసి చేతులు దులుపుకున్నట్లుంది కేంద్రం ప్రభుత్వ వైఖరి. ఇకపై రాష్ట్రాల అవసరాలకనుగుణంగా వ్యాక్సిన్లను వాటిని తయారు చేస్తున్న సంస్థల నుంచి కొనుక్కోవచ్చు అని సెలవిచ్చారు. చూడడానికి, వినడానికి బాగానే ఉంది. కానీ చిన్న రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. మరి అవి ఎలా కొనుగోలు చేస్తాయి. వాటికి ఏమైనా కేంద్రం సాయం చేస్తుందా అన్నది స్పష్టం చేయాల్సి ఉంది రాష్ట్రాలకు ఇచ్చే 50 శాతం వ్యాక్సిన్లను బహిరంగ మార్కెట్లో విక్రయించే కోవచ్చని చెప్పడంలోనే అసలు మతలబు  ఉంది. కేంద్రానికి ఇచ్చే వ్యాక్సిన్‌ ‌లకు ఒక ధర, రాష్ట్రానికి ఇచ్చే వ్యాక్సిన్‌ ‌లకు ఇంకోరకం ధర. ఒకే వ్యాక్సిన్‌ ‌కు వేర్వేరు ధరలను కేంద్రం ఎలా నిర్ణయిస్తుంది అనీ ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న. రాజకీయ పార్టీలలో ఈ ప్రశ్న మొదలైంది కూడా. ఆక్సిజన్‌ ‌ను రైళ్ల ద్వారా సరఫరా చేస్తున్న కేంద్రం భవిష్యత్తు అవసరాల కోసం కొత్తగా ప్లాంట్లను ఏర్పాటు చేయాలని చేసుకోవాలని సూచించడం గందరగోళ పరిస్థితికి నిదర్శనం. ఇప్పుడు ప్లాంట్‌ ‌పెడితే ఎప్పటిలోగా సరఫరా ప్రారంభమవుతుంది.. వ్యాక్సిన్ల  ఉత్పత్తి ఇప్పుడు పెంచడం ప్రారంభిస్తే అందరికీ సరిపడా టీకాలు ఎప్పటికీ తయారవుతాయి అన్నది కూడా జవాబు లేని ప్రశ్నలు.  మరోవైపు  మందులను బ్లాక్‌ ‌మార్కెట్‌ ‌వ్యవస్థ శాసిస్తోంది.  ఈ వ్యవస్థను నియంత్రించలేని కేంద్రం ఇక పై వ్యాక్సిన్‌ ‌పంపిణీతో పాటు వాటి ధరలకు రెక్కలు రాకుండా చూస్తుంది అని అనుకోవడం నిజంగా అత్యాశే అవుతుంది.

కొరోనా కట్టడిలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ప్రజల ప్రాణాలను రక్షించిన వారవుతారు అన్న సత్యాన్ని గ్రహించాలి. అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ప్రాణాల కంటే విలువైనది ఏదీ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. లాక్‌ ‌డౌన్‌  ‌పెట్టడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి అన్న మాట వాస్తవమే అయినప్పటికీ ఆ పరిస్థితి రాకుండా ప్రజలు అవగాహనతో అప్రమత్తతతో నడుచుకునే లా ప్రభుత్వాలు వారిని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల దయనీయ పరిస్థితిని చూసిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వ  బాధ్యతారహిత వైఖరిని గమనించి కేంద్రాన్ని ప్రశ్నించడం  ప్రజలకు కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. సుప్రీంకోర్టు జోక్యం తో నైనా ప్రభుత్వాలు కార్యాచరణకు ఉంటాయో లేదో చూడాలి. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూస్తూ కూర్చుంటే ప్రాణాలు గాలిలో కలిసే ప్రమాదముంది. కాబట్టి ప్రజలే స్వీయ నియంత్రణ పాటిస్తూ.  కొరోనా   బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ప్రస్తుతం చేయగలిగిందేమీ లేదు.
– వి.మహేందర్‌ ‌రెడ్డి, సీనియర్‌ ‌జర్నలిస్ట్
9963155523

Leave a Reply