Take a fresh look at your lifestyle.

ఎపి సిఎం వైఎస్‌ ‌జగన్‌కు కొరోనా నెగెటివ్‌

  • టెస్ట్ ‌చేసి ధృవీకరించిన వైద్యులు
అమరావతి,ఏప్రిల్‌ 17 : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి కరోనా వైరస్‌ (‌కోవిడ్‌-19) ‌పరీక్షలు చేయించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ర్యాపిడ్‌ ‌టెస్టింగ్‌ ‌కిట్‌ ‌ద్వారా డాక్టర్లు  పరీక్ష  నిర్వహించారు. పరీక్షలో కరోనా నెగెటివ్‌గా నిర్దారణ అయింది. దక్షిణ కొరియా నుంచి రాష్టాన్రికి లక్ష కరోనా ర్యాపిడ్‌ ‌టెస్ట్ ‌కిట్లను ప్రత్యేక చార్టర్‌ ‌విమానంలో శుక్రవారమే తీసుకొ చ్చారు.
ర్యాపిడ్‌ ‌టెస్టు కిట్ల ద్వారా 10 నిమిషాల వ్యవధిలోనే కరోనా ఫలితం తేలనుంది. కమ్యూనిటీ టెస్టింగ్‌ ‌కోసం ర్యాపిడ్‌ ‌కిట్లను వినియోగించనున్నారు.ఇన్ఫెక్షన్‌ ఉం‌దా.. లేదా? అని నిర్దారించడమే కాకుండా  ఇన్ఫెక్షన్‌ ‌వచ్చి తగ్గినా కూడా ర్యాపిడ్‌ ‌కిట్లు గుర్తించను న్నాయి.

Leave a Reply