Take a fresh look at your lifestyle.

కొరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేలా చర్యలు చేపట్టాలి

కాంగ్రెస్‌ ‌నేత, కేంద్ర మాజీ ఆర్థికశాఖ మంత్రి చిదంబరం డిమాండ్‌
కొరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభం నుంచి ఉద్యోగస్తులు, కార్మికులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రకటించాలని కాంగ్రెస్‌ ‌నేత, కేంద్ర మాజీ ఆర్థికశాఖ మంత్రి పీ చిదంబరం డిమాండ్‌ ‌చేశారు. ప్రజలు బతుకుదెరువు చూపేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. దాదాపు 12 కోట్లమంది ఉద్యోగులకు వేతనాలు చెల్లించే విషయంలో యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో కోట్లమంది ప్రజలు చిక్కుబడి పోయినందున లాక్‌డౌన్‌ ‌సడలింపుపై సరైన విధానం రూపొందించాలని సూచించారు. ఇప్పుడు సమయమే కీలకమైనది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేకపోవటంతో ప్రైవేటురంగంలో పెద్ద ఎత్తున కంపెనీలు మూతపడే ప్రమాదం పొంచిఉంది. అదే జరిగితే కోట్లమంది రోడ్డునపడుతారని చిదంబరం బుధవారం ట్వీట్‌ ‌చేశారు. ఇందుకు తగిన ఆలోచనలు చేయాలన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!