- ముందస్తు జాగ్రత్తలే రక్ష
- ప్రపంచ దేశాల మధ్య సంఘీభావం కీలక అంశం
- డబ్ల్యుహెచ్‌ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ చైర్మన్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్
న్యూఢిల్లీ, అక్టోబర్ 5 : చికిత్సలు, వ్యాధి గుర్తింపు పరీక్షలు, వ్యాక్సిన్లతోనే మహమ్మారి కొరోనా నుంచి బయటపడే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ప్రపంచ దేశాల మధ్య సంఘీభావం అత్యంత కీలకమైన అంశమని హర్షవర్దన్ చెప్పారు. ఎమర్జెన్సీ వ్యాధులు ప్రబలుతున్న సమయంలో అత్యవసర సంసిద్ధతను బలోపేతం చేయడం, రిస్క్ మేనేజ్మెంట్ సమస్యలను ఎదుర్కోవాలన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ చైర్మన్ హోదాలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సోమవారం మాట్లాడారు. ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం కావడం ఇది అయిదోసారి. డబ్ల్యూహెచ్‌వోలో 34 మంది క్వాలిఫైడ్ సభ్య దేశాలు ఉన్నాయి. మూడేళ్ల కోసం ఆ సభుల్ని ఎన్నుకుంటారు. హెల్త్ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలు, విధానాలను అమలు చేసే విధంగా ఎగ్జిక్యూటివ్ బోర్డు సవి•క్షిస్తుంది.
సభ్యదేశాలు ఆమోదం తెలిపిన తీర్మానం గురించి తాజా బోర్డు వి•టింగ్‌లో చర్చించారు. కోవిడ్ మహమ్మారిపై తీసుకున్న చర్యల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ టెడ్రోస్ మధ్యంతర నివేదికను రిలీజ్ చేయనున్నారు. అయితే ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ డాక్టర్ హర్షవర్దన్ వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ.. మానవజాతి కొరోనాతో పోరాటం చేస్తున్నదని మంత్రి హర్షవన్ తెలిపారు. మానవ సంక్షేమం కోసం ఎందరో మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు అర్పించారన్నారు. వైరస్ నుంచి రక్షించేందుకు ప్రాణాలను త్యాగం చేసిన వారిని ప్రపంచం ఎన్నటికీ మరిచిపోదన్నారు. వారి త్యాగాలు వృథాపోనివ్వకుండా చూడాలని మంత్రి కోరారు. కొరోనా విషాదం పెను ప్రభావం చూపిందని, 35 మిలియన్ల మంది వైరస్ బారినపడ్డారని, 10 లక్షల కన్నా ఎక్కువ మందే చనిపోయారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల సంఖ్యలో జనం డబ్ల్యూహెచ్‌వోపై ఆశతో ఎదురుచూస్తున్నారని చైర్మన్ హర్షవర్దన్ తెలిపారు. మహమ్మారి లాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు సంయుక్తంగా బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. చాలా దేశాలు కట్టుబడి పోరాటం చేశాయని, దాంతో లక్షలాది మంది ప్రాణాలను కాపాడుకోగలిగామన్నారు.