Take a fresh look at your lifestyle.

సామాజిక మాధ్యమాల్లో.. అంటువ్యాధిలా కొరోనా దుష్ప్రచారం

“సామాజికమాధ్యమాల్లో దీనిని గురించి విస్తృతంగా ప్రచారం కావడంతో ఈ సమాచారం దావానలంలా అంతటా వ్యాపించింది. ప్రజల్లో భయాందోళనలను సృష్టించింది. పర్యవసానంగా ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ ‌మార్కెట్లు రోజుల తరబడి కుప్పకూలాయి. ప్రజలు కూడా ఈ వైరస్‌ ‌సమాచారాన్ని సరిచూసుకోకుండా, నిర్ధారణ చేసుకోకుండా ఆనోటాఈనోటా ప్రచారం చేశారు. ఈ వదంతుల వ్యాప్తిలో చైనా ముందుందని సిర్యాకాజ్‌ ‌యూనినర్శి టీలో సమాచార శాస్త్ర విభాగం అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌జెన్‌ ‌గ్రిగ్వియల్‌ ‌పేర్కొన్నారు. ప్రజల మానసిక స్థయిర్యాన్ని దెబ్బతీయ డానికి  కుట్ర పూరితంగా ఈ ప్రచారం జరిగిందని అభిప్రాయ పడుతున్నారు. ప్రజల్లో ఆందోళన, ఉత్కంఠను ఒక పథకం ప్రకారం వ్యాపింపజేస్తున్నారు. ఏది నిజమో,ఏది కాదో ఆలోచించుకోకుండా ఆందోళనలకు గురి అవుతున్నారు.”

కొరోనా వైరస్‌ ‌యావత్‌ ‌ప్రపంచాన్నీ గడగడ లాడిస్తోంది. ఈ భూగోళంలో ఏ కొద్ది ప్రాంతమో మినహా అంతటా కరోనా వైరస్‌ ‌సమాచారం హడలెత్తిస్తోంది. అది సరైనదా కాదా అని ఎవరూ ఆలోచించే పరిస్థితిలో లేరు. కరోనా వైరస్‌ ‌పేరు వినగానే వణకిపోతున్నారు. ఆరోగ్యశాఖ అధికారుల హెచ్చరి కలను పురస్కరించుకుని చాలా మంది తమ ఇళ్ళల్లోనే బందీలవుతున్నారు. కరోనా సమాచార వ్యాప్తి అనేది అంటువ్యాధిలా తయారైంది.ప్రభుత్వం వార్తా ప్రసార సాధనాల ద్వారా తరచూ కరోనా రాకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలూ, చేయవలసినవీ, చేయకూడనివి మార్గదర్శకాలతో ప్రజలు ఊపిరి పీల్చే వ్యవధి లేకుండా ప్రచారం జరిపిస్తోంది.ప్రజలు బయటకు రావద్దనీ, సమూహాల్లో చేరవద్దనీ, ఇంటి నుంచే పనులు చేసుకోవాలని, సలహా ఇస్తోంది. స్కూళ్ళు,విద్యా సంస్థలకు మార్చి 31 వరకూ సెలవులు ప్రకటించారు. ఏ క్షణంలో ఎలాంటి వార్త వస్తుందోనని ప్రజలు భయంతోనూ,ఉత్కంఠతోనూ ఎదురు చూస్తున్నారు. ఈ వైరస్‌ ‌నుంచి బయటపడేందుకు చాలా మంది చిట్కాలు చెబుతున్నారు.ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.కొందరు ప్రజలు వాడాల్సిన మాస్క్‌లు ఇతర పరికరాలను దాచి పెడుతున్నారు.

నోవల్‌ ‌కరోనా బయటపడింది మొదలు వైద్య,ఆరోగ్యవర్గాల్లో కరోనాను అన్‌ ‌సెక్సీ మోనికర్‌ ‌కోవిడ్‌-19 అని అంటారు.ఈ ఏడాది ఆరంభం నుంచే ఇది వ్యాపించడం మొదలైంది. సామాజికమాధ్యమాల్లో దీనిని గురించి విస్తృతంగా ప్రచారం కావడంతో ఈ సమాచారం దావానలంలా అంతటా వ్యాపిం చింది.ప్రజల్లో భయాందోళనలను సృష్టించింది. పర్యవసానంగా ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ ‌మార్కెట్లు రోజుల తరబడి కుప్పకూలాయి. ప్రజలు కూడా ఈ వైరస్‌ ‌సమాచారాన్ని సరిచూసుకోకుండా, నిర్ధారణ చేసుకోకుండా ఆనోటాఈనోటా ప్రచారం చేశారు. ఈ వదంతుల వ్యాప్తిలో చైనా ముందుందని సిర్యాకాజ్‌ ‌యూనినర్శి టీలో సమాచార శాస్త్ర విభాగం అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌జెన్‌ ‌గ్రిగ్వియల్‌ ‌పేర్కొన్నారు. ప్రజల మానసిక స్థయిర్యాన్ని దెబ్బతీయ డానికి కుట్ర పూరితంగా ఈ ప్రచారం జరిగిందని అభిప్రాయ పడుతున్నారు. ప్రజల్లో ఆందోళన, ఉత్కంఠను ఒక పథకం ప్రకారం వ్యాపింపజేస్తున్నారు. ఏది నిజమో,ఏది కాదో ఆలోచిం చుకోకుండా ఆందోళనలకు గురి అవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించిన అధికారులు హెచ్చరి కలు,వెలువడుతున్న సమాచారం ప్రజల్లో ఆందోళనలను సృష్టించింది.వదంతలు నిమిషాలు, ఘడియల్లో వ్యాపిస్తాయి. అమెరికాలో నుంచి యావత్‌ ‌ప్రపంచానికి వ్యాపించింది.ఇది ఒక హిస్టీరియాలా వ్యాపించింది. ఆఫ్రికన్లను గడ్డం గీసుకోమనీ, ఆసియన్లను దైవానుగ్రహం కోసం ప్రార్థనలు చేయమని సలహాలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ఇచ్చారు.

జనవరి 22వ తేదీన ఫెస్‌బుక్‌లో ఒక పోస్టు వైరల్‌ అయింది. ఒక రోగి చిత్రాన్ని సెంటర్‌ ‌ఫర్‌ ‌డీసీజ్‌ ‌కంట్రోల్‌ అం‌డ్‌ ‌ప్రివెన్షన్‌ ‌ప్రసారంచేస్తూ కరోనా వ్యాక్సిన్‌ను అమెరికన్‌ ‌కంపెనీ తయారు చేసిందనీ, ఆ చిత్రంలో ఉన్న వ్యక్తి ఆ వ్యాక్సిన్‌ ‌వల్ల లాభ పడ్డాడని పోస్టు పెట్టింది. ఇది ఏ విధంగా చూసినా నిజం కాదు. మూఢ నమ్మకాలకు అతీతంగా ఉంది. నోవల్‌ ‌కరోనా ఒక వ్యాక్సిన్‌ ‌ద్వారా తగ్గడం అసాధ్యం. అయితే, ఫేస్‌ ‌బుక్‌లో చూపిన వ్యక్తి సార్స్ ‌వ్యాధి పీడితుడు,ఇది కూడా కరోనా లాంటిదే. ఇది కూడా చైనా నుంచే వ్యాప్తం అయింది. 2002-2003 మధ్య కాలంలో ఈ వ్యాధికి వందలాది మంది మరణించారు.కరోనా నుంచి జనాన్ని బయటపడేసేందుకు వ్యాక్సిన్‌ ‌తయారు చేయమని కంపెనీలకు నిధులు సమకూ రుస్తున్న మాట నిజమే కానీ,చైనాలో ఈ వ్యాధి మొదట బయట పడిన వూహన్‌లో ఎటువంటి వ్యాక్సిన్లు అందుబాటులో లేవు.ఈ వైరస్‌ ‌మనిషికి మామూలుగా వచ్చే జలుబు కన్నా దారుణమైనది కాదు.

ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడి నుంచి స్చేచ్ఛ పతకం అందుకున్న రష్‌ ‌లింబాగ్‌ ‌ఫిబ్రవరి 24వ తేదీన రేడియోలో ప్రసంగిస్తూ స్పష్టం చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌ను దింపేయడానికి ఇదొక ఆయుధంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. ప్రజలను భయపెట్టేందుకే కరోనా వైరస్‌ ‌భూతాన్ని సృష్టించారు. డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌పాలన అంతమొందాలని కోరుకునేవారు సృష్టించిన భయం ఇది. ఇలాంటి అర్థసత్యాలను అదే పనిగా ప్రచారం చేయడం ప్రారంభించారు.కుట్రల కథనాల్లో తాజాగా వాట్స్ అప్‌ల ద్వారా కరోనా భయాలను వ్యాపింపజేశారు. కోవిడ్‌ -19 ‌మామూలు జలుబు కాదు.జ్వరం,దగ్గు వంటి అనేక లక్షణాలతో ఈ రోగం మనిషిని చుట్టుముడుతుంది.ఇది సోకినవారికి మరణాలు రెండు శాతం కన్నా తక్కువ ఉంటాయి. కోవిడ్‌ -19 అదో రకం కరోనా అనీ,ఇలాంటి వైరస్‌లను గురించి వివరించేందుకు విస్తృతమైన అర్థం ఇచ్చే మాట అని లింబాగ్‌ ‌తెలిపారు. అయితే, మనం దీనిని గురించి బహిరంగంగా ఏవేవో మాట్లాడుకుంటున్నాం,ఎవరు చెప్పినా వింటున్నాం.వాట్స్ అప్‌లలో సమాచారాన్ని పంచుకుంటున్నాం.కుట్ర పూరితమైన ప్రచారం జరుగుతోంది.దీనికి మంత్రం వేసినట్టు మందులున్నాయనీ,చికిత్సా విధానాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.

ఈ వైరస్‌కు వూహన్‌-400 అని పేరు పెట్టారు.ఇది ఎక్కడ నుంచి వ్యాపించిందో ఆనగరం పేరు పెట్టారు. ఇలాంటివి వచ్చినప్పుడు వ్యాపార ధోరణిలో ప్రచారాలు చేయడం అసాధారణం కాదు.డీన్‌ ‌కాంటూజ్‌ 1981‌లో రాసిన ఐస్‌ ఆఫ్‌ ‌డార్క్ ‌నెస్‌ ‌నవల ఆధారంగా ఒక కథనం ట్విట్టర్‌లో వైరల్‌ అయింది. అలాగే ఇప్పుడు చైనాలోని వూహన్‌ ‌లో బయటపడటం వల్ల ఈ వైరస్‌ను వూహన్‌-400 ‌పేరిట ప్రచారం చేస్తున్నారు.ఇది జీవరసాయన ఆయుధం వంటిదనీ, ఇది సోకినవారు నూరు శాతం మరణించడం ఖాయమని ప్రచారం చేస్తున్నారు. తప్పుడు సమాచారన్ని వ్యాపింపజేయడం ద్వారా ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్నారు. అయితే, కోవిడ్‌ -19 ఇతరులకు వ్యాపించే వ్యాధి అనీ మాస్క్‌లు ధరించమని సలహా ఇస్తున్నారు. ఇది నిజమో కాదో నిర్ధారించడానికి కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన డూస్‌,‌డూనాట్‌ ‌జాగ్రత్తలను శ్రద్ధగా పరిశీలిస్తే తెలుస్తుంది.

మాస్క్‌ల విక్రయం వ్యాపారంగా తయారైంది. సొమ్ము చేసుకోవడానికి కొరత సృష్టిస్తున్నారు.ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసిన వారిపైనా మోసపూరితమైన ప్రచారాలు చేసేవారిపైనా సింగపూర్‌ ‌ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలాగే, మాస్క్ ‌లను దాచిపెట్టి ఎక్కువ రేటుకు అమ్మేవారిపైనా చర్యలు తీసుకుంటోంది. మన దేశంలో కూడా పోలీసులు అలాంటి చర్యలు తీసుకుంటున్నారు.ఉత్తరప్రదేశ్‌ ‌లో ఒక దొంగ స్వామిని అరెస్టు చేశారు. తెలంగాణ పోలీసులు నేషనల్‌ ‌డిశాస్టర్స్ ‌మేనేజిమెంట్‌ ‌యాక్ట్ (2005 ) ‌కింద ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు,ఆన్‌ ‌లైన్‌ ‌ప్రసారాల ద్వారా తప్పుడు సమాచారాన్ని అందించేవారిపై చర్యలు తీసుకునే విషయమై మేం దృష్టి సారించాం. కొంతమంది ప్రసార సాధనాల జర్నలిస్టులు కూడా తమకు అందిన సమాచారాన్ని రుజువు చేసుకోకుండా ప్రసారానికి అందజేస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని అందించడం నేరమనే విషయం ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి.

rema rajeswari
డా.సునీమ్‌ అహ్మద్‌ ‌ఖాన్‌,
‌మెడికల్‌ ఆఫీసర్‌,
‌సీఆర్పీఎఫ్‌••, ,‌శ్రీనగర్‌తో కలిసి
రెమా రాజేశ్వరి, ఎస్పీ,
మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా
‘ది టైమ్స్ అఫ్‌ ఇం‌డియా ‘ సౌజన్యం తో…

 

Leave a Reply