- కొత్తగా 773 మందికి కొరోనా నిర్దారణ
- ఇప్పటి వరకు 5,194 కరోనా పాజిటివ్ కేసులు
- కొరోనా బారినపడి 149 మంది మృతి: కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వా
భారత్‌లో కొరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 773 మందికి కోవిడ్-19 సోకినట్లు నిర్దారణ కాగా 32 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 5,194 కొరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 402 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19 బారినపడి 149 మంది చనిపోయారు. రాష్టాల్రకు వైద్య పరికరాలు అందిస్తున్నాం. కరోనా హాట్‌స్పాట్లలో పర్యవేక్షణకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. అందరూ తప్పకుండా సామాజిక దూరం పాటించాలి. దేశంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల కొరత ఇప్పుడు గానీ భవిష్యత్తులోనూ ఉండదు. దేశంలో మాత్రల నిల్వలు సరిపడా ఉన్నాయని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇదిలావుంటే మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది.
రాష్ట్రంలో మంగళవారం భారతదేశంలోనే అత్యధికంగా 6.2శాతం మరణాలు సంభవించాయి. 11.19 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో సోమవారం నాటికి 868 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదైన 116 పాజిటివ్ కేసులు, 6 మరణాలు ముంబైకి చెందినవే కావడం గమనార్షం. సోమవారం నాటికి ముంబైలో 642 కరోనా పాజిటవ్ కేసులు నమోదు కాగా.. తాజాగా మరో 116 కొత్త కేసులు రావడంతో ఆ సంఖ్య 758కి చేరింది. మమంళవారం కరోనా సోకిన వారు అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన దాఖలాలు లేవు. కానీ, వీరికి అంతకు ముందే మధుమేహం లేదా రక్తపోటు వంటి వ్యాధులు ఉన్నట్లు తెలిసింది. వ్యాధి సోకిడమో లేక దాని కారణంగా మృత్యువాతపడిన వారిలో దాదాపు అందరికీ.. ఏదో ఒక వ్యాధి ఉన్నట్లు వైద్యులు అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర సీఎంలు అరవింద్ కేజీవ్రాల్, ఉద్ధవ్ ఠాక్రేలకు కేరళ సీఎం పినరాయ్ విజయన్ లేఖ రాశారు. ఆయా రాష్టాల్ల్రో సేవలు అందిస్తున్న కేరళ నర్సులు, డాక్టర్లపై తగిన శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. అంతేకాక.. నర్సులు ఎవరికైనా కోవిడ్-19 సోకితే వారిని అందరితో పాటు.. కాకుండా వేరుగా ఉంచి చికిత్స అందించాలని ఆయన పేర్కొన్నారు.