Take a fresh look at your lifestyle.

చాపకింద ‘కొరోనా’..!

రోజురోజుకూ విజృంభిస్తున్న పాజిటివ్‌ ‌కేసులు
•ం క్వారంటైన్‌లో ఇద్దరు కలెక్టర్లు
ఆందోళనలో సామాన్య ప్రజానీకం

తెలంగాణలో కొరోనా వైరస్‌ ఉ‌గ్ర రూపం దాలుస్తుంది. కంటికి కనిపించని వైరస్‌ ‌చాపకింద నీరులా అతి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలోనే అదికారులు, ప్రజా ప్రతినిధులు, వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు కొరోనాని కట్టడి చేయడానికి నిరంతం శ్రమిస్తోన్నారు. ఈ కోణంలోనే వారిలో ఎంతో మంది కొరోనా బారిన పడుతున్నారు. మరికొంతమంది తమ ప్రాణాలను కూడా వదులుతున్నారు. దీంతో ఆందోళనకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాగా కొద్ది రోజుల క్రితం వరకు వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు కొరోనా బారిన పడుతుంటే, ప్రస్తుతం ఆ జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నేతలు కూడా చేరుతున్నారు.

దీంతో నాయకులు, అధికారులు, జిల్లాల కలెక్టర్లు కూడా •ం క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఈ  నేపథ్యంలోనే సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామా రెడ్డి సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. ఈ మధ్య కాలంలో జడ్పీటీసీలు కలెక్టర్‌ను కలవగా వారితో వచ్చిన ఓ వ్యక్తికి కొరోనా పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం ఆ కొరోనా బాదితుడు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం గురించిన సమాచారం రావడంతో వెంటనే కలెక్టర్‌ ‌కూడా సెల్ఫ్ ‌క్వారంటైన్లోకి వెళ్లారు. ఇంటి నుంచే పనులను చక్కబెడుతున్నారు. అదే విధంగా యాదాద్రి జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ •ం ‌క్వారంటైన్లోకి వెళ్లారు. యాదాద్రి జడ్పీ సీఈవోకు కొరోనా పాజిటివ్‌ అని తేలగా జూన్‌ 5‌వ తేదీన ఆయనతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న, ఆయనతో కాంటాక్టులో ఉన్న అధికారులు, ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply