Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో ఆగని కొరోనా ఉధృతి

పదివేలు దాటిన పాజిటివ్‌ ‌కేసులు
వైరస్‌తో కొత్తగా 52 మంది మృతి
నిజామాబాద్‌ ‌పోలీసులను వదలని కొరోనా
హనుమాన్‌ ‌శోభాయాత్ర రద్దు
రాష్ట్రంలో కొరోనా ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సోమవారం రాత్రి 8 గంటలకు గడిచిన 24 గంటల్లో కొరోనా కేసులు 10 వేలు దాటాయి. రాష్ట్రంలో కొత్తగా 10,122 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కొరోనా కేసుల సంఖ్య 4,11,905 లక్షలకు చేరింది. ఇందులో 3,40,590 మంది డిశ్చార్జ్ ‌కాగా, 69,221 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కొత్తగా కొరోనాతో 52 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొరోనా మరణాల సంఖ్య 2094కి చేరింది. రోజు రోజుకు రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సెకవండ్‌ ‌వేవ్‌ ‌కోరలు చాస్తున్నది. కొరోనాతో కొత్తగా ఆరుగురు మృతి చెందారు…1701 పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయ్యాయి. నిజామాబాద్‌ ‌పోలీసు శాఖలో కొరోనా కలకలం రేపుతోంది. విధినిర్వహణలో ఉన్న సిబ్బంది వైరస్‌ ‌బారిన పడడం ఆందోళనకు గురిచేస్తున్నది. ఇటీవల జరిగిన నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల బందోబస్తుకు జిల్లా నుంచి ఏసీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు కలిపి 112 మంది వెళ్లారు. 16 రోజుల పాటు అక్కడ విధులు నిర్వహించారు.

ఎన్నిక ముగిసిన తర్వాత జిల్లాకు వొచ్చిన పోలీసులు ఒక్కొక్కరు వైరస్‌ ‌బారిన పడ్డారు. ఇప్పటివరకు 32 మందికి వైరస్‌ ‌నిర్దారణ అయింది. వీరితో పాటు వీరి కుటుంబ సభ్యులకు సైతం వైరస్‌ ‌సోకింది. దీంతో పోలీసు శాఖలో కలకలం రేగింది. కోవిడ్‌ ‌బాధితుల్లో కొందరు హోం ఐసోలేషన్‌లో, మరికొందరు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి 17 మంది కోలుకున్నట్లు తెలిసింది. గౌలిగూడ నుంచి తాడ్‌బండ్‌ ‌వరకు నిర్వహించే హనుమాన్‌ ‌శోభాయాత్రను రద్దు చేసినట్లు భజరంగ్‌దళ్‌ ‌ప్రకటించింది. కొరోనా పెరుగుతున్న నేపథ్యంలో శోభాయాత్రకు భారీగా భక్తులు తరలిరావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. హనుమాన్‌ ‌శోభాయాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. 21 మందితో మాత్రమే శోభాయాత్ర నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది. శోభాయాత్రను వీడియో తీసి నివేదిక సమర్పించాలని తెలిపింది. కోవిడ్‌ ‌నిబంధనలు పాటించాలని వీహెచ్‌పీ, భజరంగ్‌ ‌దళ్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే భక్తుల తాకిడి ఎక్కువ కావటం వల్ల శోభాయాత్రను రద్దు చేసినట్లు భజరంగ్‌దళ్‌ ‌తెలిపింది.

Leave a Reply