Take a fresh look at your lifestyle.

చాపకింది నీరులా కొరోనా వ్యాప్తి

  • ప్రపంచవ్యాప్తంగా మరణించినవారు..42,322
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఈ వైరస్‌ ‌చాప కింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 42,322కు చేరుకుంది. ఈ వైరస్‌ ‌బారిన 8,59,032 మంది పడ్డారు. కరోనా బారి నుంచి కోలుకున్న వారు 1,78,101. కోలుకున్న వారంతా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ ‌విధించుకున్నాయి. అత్యధికంగా ఇటలీలో 12,428 మంది ఈ వ్యాధితో చనిపోయారు. అక్కడ పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 1,05792కు చేరుకుంది.
అమెరికాలో 4,054 మంది చనిపోగా, 1,88,578 మంది ఈ వైరస్‌తో బాధపడుతున్నారు. స్పెయిన్‌లో 95,923 కేసులు(మృతులు 8,464), జర్మనీలో 71,808 కేసులు(మృతులు 775), ఫ్రాన్స్‌లో 52,128 కేసులు(మృతులు 3,523), ఇరాన్‌లో 44,605 కేసులు(మృతులు 2,898), యూకేలో 25,150 కేసులు(మృతులు 1,789), స్విట్జర్లాండ్‌లో 16,605 కేసులు(మృతులు 433), టర్కీలో 13,531 కేసులు(మృతులు 214), బెల్జియంలో 12,775 కేసులు(మృతులు 705), నెదర్లాండ్స్‌లో కేసులు 12,595(మృతులు 1,039), దక్షిణ కొరియాలో 9,887 కేసులు(మృతులు 165) నమోదు అయ్యాయి.
కాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 8 లక్షల 50వేలకి చేరగా,42 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.అమెరికాతో  పోలిస్తే భౌగోళికంగా, జనాభా పరంగా చిన్నదైన ఇటలీ తర్వాతి స్థానంలో వుంది. ఆ తర్వాత స్పెయిన్‌, ‌జర్మనీ తదితర దేశాలున్నాయి. భారీగా జనం పాల్గొనే అవకాశమున్న సమావేశాలను, ఉత్సవాలను ఎవరికి వారు స్వచ్ఛందంగా నిలిపేయాలని కోరింది. ఆ వైరస్‌ ‌వ్యాప్తి చెందకుండా చూడగలిగింది.ఈ చర్యలన్నిటినీ పారదర్శకంగా అమలు చేసింది. వదంతులకు ఆస్కారం లేకుండా చేసింది. గతానుభవాలున్నాయి గనుక పౌరులు కూడా ప్రభుత్వానికి సహకరించారు. అందువల్లే ఆ దేశం విజయం సాధించగలిగింది

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy