Take a fresh look at your lifestyle.

అ‌గ్రరాజ్య అహంకార ధోరణి

ముందు నోరు జారి, తర్వాత నాలిక కర్చుకున్నప్పటికీ అగ్రరాజ్యం అమెరికా తన అహంకారాన్ని మాత్రం బయటపెట్టుకుంది. ఇరాక్‌, ‌క్యూబాదేశాలను శాసించినట్లుగా భారతదేశంపైన పెత్తనం చెలాయిస్తున్నట్లుగా ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌మాటలున్నాయి. ఆయన మాటలు నూటాముప్పై కోట్ల భారతీయులను బాధించాయి. ఇటీవల కాలంలో ఆయన భారతదేశానికి వచ్చినప్పుడు ఘనమైన సన్మానం జరిగింది. ఆయన కోరుకున్నట్లే లక్షలాదిమంది భారతీయులు ఆయనకు స్వాగతం పలికారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని పలుసార్లు ఆయన పొగడ్తలతో ముంచెత్తడంతో పాటు, అత్యంత సన్నిహితులమన్నట్లుగా పలుసార్లు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న విధానం వీరిద్దరి గాఢమైన స్నేహాన్ని బహిర్గతపర్చింది. ఆయనరాక భారత్‌తో స్నేహంకన్నా వ్యాపార దృక్పథమే ఎక్కువని ఆనాడు భారత వార్తాపత్రికలు పేర్కొన్న విషయం తెలియంది కాదు. ఏదిఏమైనా మోదీ అమెరికా పర్యటన అయినా, ట్రంప్‌ ‌భారత పర్యటన అయినా రెండు దేశాల మధ్య విడదీయరాని బంధం ఏర్పడిందన్న భావన ప్రపంచదేశాల్లో కూడా ఉంది.

అంతటి అభిమానాన్ని ఒకరికొకకు చాటుకున్న దశలో ట్రంప్‌ ఇటీవల మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపర్చింది. ఒక విధంగా భారత్‌ను ఆయన హెచ్చరించినట్లుగానే ఉంది. తన మాటలు వినకపోతే ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుందన్న మాట ప్రతీ భారతీయుడి అహం దెబ్బతీసేదిగా ఉంది. కేవలం తనకు కావాల్సిన మందులను తమ దేశానికి ఎగుమతి చేయాలన్న విషయంలో ఆయన ఆ తరహాలో మాట్లాడడం అందరినీ బాధించిన విషయం. చైనాలో పురుడుపోసుకున్న కొరోనా వైరస్‌ ఇప్పుడు ఆగ్రరాజ్యమైన అమెరికాను వణికిస్తున్నది. ఈ వైరస్‌ ‌కారణంగా అమెరికాలో ఇప్పటికే వేలాది మంది మృతి చెందగా, లక్షలాది మంది వ్యాధి బారిన పడ్డారు. ప్రపంచ దేశాల్లో ఏ ముప్పు సంభవించినా సహాయం కోసం సహజంగా అమెరికా వైపు చూసే అలవాటుంది. కాని, ఈ కొరోనా వైరస్‌తో అమెరికానే ఇతరుల సహకారం కోసం ఎదురుచూస్తున్నట్లుంది. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ వైరస్‌ ‌నుండి కాపాడుకోవడానికి కావాల్సిన మందులను సమకూర్చుకోలేకపోతోంది. అలాంటి పరిస్థితిలోనే వైరస్‌ను తట్టుకోగలమందు భారత్‌లో ఉండడంతో దాన్ని సమకూర్చుకోవాలనుకున్నప్పుడు వినమ్రంగా విజ్ఞాపన చేసుకోవాల్సి ఉండగా బెదిరించే ధోరణిలో అడుగడమన్నది యావత్‌ ‌భారత్‌ ‌ప్రజకు ఆగ్రహాన్ని కలిగిస్తున్న అంశం. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌త•పాటు పారసిటమాల్‌ ‌మాత్రలను భారతదేశం పెద్ద ఎత్తున తయారుచేస్తున్నది. ఈ మాత్రలు కొరోనాను ఎదుర్కునే విషయంలో ఇతర మందుల తరహాలోనే వైద్య సిబ్బందికి కొంతవరకు ఉపయోగపడుతున్నదని అర్థమైంది. దీంతో ట్రంప్‌ ఇదే విషయాన్ని బాహాటంగా ప్రకటించడంతో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ప్రపంచ దేశాల్లో డిమాండ్‌ ‌పెరిగింది. అయితే ఇదే సమయంలో భారత్‌ ‌కూడా కొరోనాను ఎదుర్కుంటున్న సమయంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ అవసరం ఇక్కడ ఎక్కువ ఉండడంతో భారత ప్రభుత్వం ఈ మందుతో పాటు మరికొన్ని మందుల ఎగుమతులను నిషేధించింది. దీంతో అమెరికాకు కూడా వీటి ఎగుమతి లేకుండా పోయింది. దాని అవసరాన్ని గుర్తించిన ట్రంప్‌ ‌తమకా మందును సరఫరా చేయాలని కోరాడు.

ఆయన కోరడంలో తప్పులేదు కాని, వెంటనే ఎగుమతి చేయని పక్షంలో ప్రతీకార చర్యలకు పాల్పడాల్సివస్తుందంటూ హెచ్చరించిన విధానమే భారతీయులనిప్పుడు ఆగ్రహానికి గురిచేస్తున్నది. కొరోనా ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తిలో ఉండడంతో అమెరికాతో పాటు దాదాపు ముప్పై దేశాలు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ‌మందును సరఫరాచేయాలని భారత్‌ను అడుగుతున్నాయి. దీంతో భారత ప్రభుత్వం మానవతా ధ••క్పథంతో మందుల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని సడలించింది. తోటి దేశాల్లోని ప్రజలను కాపాడాలన్న దృష్టితో కేంద్రం ఈ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే ప్రపంచ దేశాలకు భారత దేశం నుండే మందులు అధికమొత్తంలో సరఫరా అవుతున్నాయి. అయితే నిషేధం ఎత్తివేస్తున్నట్లు భారత్‌చేసిన ప్రకటన ట్రంప్‌ ‌హెచ్చరికకు ఒక రోజుముందే వెలువడడంతో ట్రంప్‌ ఇప్పుడు నాలిక కర్చుకోక తప్పలేదు. మందులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని తాను స్వయంగా భారత ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడానని చెబుతున్న ట్రంప్‌, ‌దానిపై భారత్‌ ‌వెంటనే స్పందించకపోవడంతో ఆగ్రహంగా తన అహంకార ధోరణిని బయటపెట్టుకున్నాడు.

తమ దేశంతో ఉన్న వాణిజ్య సంబంధాలతో భారత్‌ ఎం‌తో లబ్ది పొందిందని గుర్తు చేస్తూనే, నిషేధం ఎత్తివేసి మందులు ఎగుమతి చేయకపోతే ప్రతీకార్యలకు అమెరికా పాల్పడుతుందని హెచ్చరించాడు. ఆయితే ట్రంప్‌ ‌ప్రకటన వెలువడడానికి ముందే భారత్‌ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో ట్రంప్‌ ‌మళ్ళీ ప్లేట్‌ ‌ఫిరాయిస్తూ, భారతదేశం, దాని ప్రధాని చాలా గొప్పవారంటూ పొగిడాడు. అయితే ముందు నోరుపారేసుకున్న ఆయన తొందరపాటుతనం అగ్రరాజ్య అహంకారాన్ని ఎత్తిచూపేదిగా ఉందంటున్నారు భారతీయులు. భారత్‌ ‌కూడా కొరోనాతో తీవ్ర పరిస్థితిని ఎదుర్కుంటున్నందున, అత్యవసర మందుల ఎగుమతిపై వారు నిషేధం విధించారని, తమ కోరికపై నిషేధాన్ని ఎత్తివేశారంటూ ఆయన అక్కడి మీడియా అడిగిన ప్రశ్నకు ప్రశాంతంగా సమాధానం చెప్పడంతోనే ఆయన తన తప్పును సరిదిద్దుకున్నారనే అనుకోవాల్సి ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!