Take a fresh look at your lifestyle.

కరోన-కోవిద్‌ 19

‌సామూహిక చేతనం, సహానుభూతి అవసరం

“ప్రపంచలోనే అత్యాధునిక వైద్య సౌకర్యాలు వున్నాయని చెప్పుకునే అమెరికాలోనే ఈ కరోనా వ్యాప్తిని అడ్డుకోగలిగే వ్యవస్థ లేదని, పరీక్షా కేంద్రాలు లేవని, కాబట్టి అత్యవసరమైతే తప్ప హాస్పిటల్‌లో చేర్చుకోవద్దనే ఆదేశాలు ఆరోగ్య శాఖ వారు ఇచ్చారంటేనే ఆరోగ్య వ్యవస్థ సామాన్యులకు ఎంత దూరంగా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక మనదేశం లాంటి దేశాల్లో ఎంత(అ)సమగ్రంగా వ్యవస్థ వుంటుందో అర్థం చేసుకోవటానికి పెద్దగా కష్ట పడనవసరం లేదు. మామూలు పరిస్థితుల్లోనే క్రూరమైన వెలివేతను ఆచరించే సమాజం, ఇలాంటి పరిస్థితుల్లో బాధిత రోగులను మరింత వెలివేతకు గురిచేయదని ఎలా నమ్మగలం!”

దునియా అంతా ‘కరోన-కోవిద్‌ 19’ ‌గత్తర లేసింది. ఆ…ఇది చైనాలో వాళ్లు అన్ని రకాల జంతువుల్ని తింటారు కాబట్టి వారికే వచ్చింది అని ఎకసెక్కాలు పడిన అందరి నోళ్లనూ మూయిస్తూ, ‘నాకు అన్నిదేశాలకూ వెళ్ళటానికి పాస్పోర్ట్ అవసరం లేదంటూ’ కరోనా తిరుగు తోంది. దీని ఆవిర్భావం వెనుకాల ప్రపంచం మీద అన్ని రకాల ఆధిపత్యం సాధించాలనుకున్న ‘పెద్దన్నలు’ కృత్రిమ జీవ వైరస్‌ని సృష్టించి వదిలారనేది కూడా ఒకపక్క ప్రచారంలో వుంది కానీ, అవి ఎంతవరకు నమ్మశక్యమో మనకు తెలియదు. కాబట్టి దాని గురించి ఇప్పుడు ఏ సమాచారం లేకుండా మాట్లాడు కోవద్దు. ఒక్కటి మాత్రం నిజం. ప్రపంచ వ్యాపితంగా తీవ్రరూపంలో మారుతున్న వాతావరణ పరిస్థితులతో ప్రతి సంవత్సరం రకరకాల కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నా యనేది వాస్తవం. ఇది కూడా దానిలో ఒక భాగమవవచ్చు. చికన్‌ ‌గున్యా లాంటివి మనకు గుర్తుండే వుండాలి. అయితే వాటన్నిటికీ లేని ఒక ప్రత్యేక లక్షణం దీనికి ఉన్నట్లుగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్‌ ‌బారిన పడిన మనిషి తన చుట్టూ వుండే వస్తువులను గానీ, తోటిమని షులను గానీ ముట్టుకుంటే ఈ వ్యాధి వెంటనే అంటుకు ంటుందని చెబుతున్నారు.

సాధారణంగా ఫ్లూ జ్వరం, జలుబు దగ్గు గానీ ఉన్నవాళ్ళకి సమీపంలో ఎవరు వున్నా అవి అంటుకునే అవకాశం ఉంటుందనేది అందరికీ తెలిసిందే. కానీ, దానివలన చనిపోయే అవకాశం లేదు. అయితే ఈ కరోనా వైరస్‌ ‌తీవ్ర లక్షణాల వల్ల మరణాలు సంభవిస్తాయి. ఈ సంఖ్య తీవ్రంగా అన్ని దేశాల్లోనూ నమోదు అవుతుండటం, పెరుగుతుండటంతో ప్రతిచోటా ఒకరకమైన చావు భయం మొదలైంది. రకరకాల పద్ధతుల్లో ప్రజలకు సమాచారం అందించడానికి అందరూ నానా ప్రయత్నాలూ చేస్తున్నారు. పనిలో పనిగా దొరికిందే అవకాశం అని, మన ‘దేశసంస్కృతీ ఉద్దారకులమనేవారు’ ‘గోమూత్రం’ తాగితే ఏ జబ్బూ దరిచేరదని ప్రవచనాలు చెబ్తున్నారు. దీనితో జబ్బు పోకపోవటం అటుంచీ, అలాంటి విధానాలను అనుసరిస్తే పరిస్థితులు మరింత ప్రమా దభరితంగా మారటం ఖాయం. తెలిసీ తెలియకుండా మూఢనమ్మకాలతో జీవితాలను ఆగం చేసుకోకుండా అప్రమత్తతగా వుండటం అవసరం. మనకు ఇప్పటివరకూ వున్న సమాచారం ప్రకారం ఈ వైరస్‌కి కుల, మత, ప్రాంత, దేశ సరిహద్దులు లేవు. దీన్ని అర్థం చేసుకుంటే, ఇలాంటి పిచ్చి సలహాలు ఇవ్వటం మానేస్తారేమో!.

corona virus in india

ఈ వ్యాధి లక్షణం జ్వరం రావడం, పొడిదగ్గు, ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు వుంటాయం టున్నారు. అవి మామూలుగా వచ్చే ఫ్లూ జ్వరంలాగే ఉండొచ్చు. వాటికి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. జలుబుకీ ఫ్లూ జ్వరానికీ, కొరోనా వైరస్‌కి మధ్య లక్షణాలలో వచ్చే తీవ్ర తేడాలను గమనించగలగాలి. అయితే, సాధారణంగా సంక్రాంతి వెళ్ళిన దగ్గరి నుంచీ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల సహజంగానే జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వస్తుంటాయి. వీటన్నిటి నివారణకి కూడా జనం పూర్తిగా ఆధునిక వైద్య వ్యవస్థ అల్లోపతి మీదే ఆధారపడరు. ఇంటి వైద్యం నుంచీ ప్రకృతి వైద్యం, హోమియోపతి, ఆయుర్వేద, యునాని వరకూ, ఇంకా ఇతరేతర నమ్మకాల వరకూ వెళతారు. మామూలుగా వాతావరణ మార్పులతో వచ్చే వాటిని తట్టుకునే రోగనిరోధక వ్యవస్థ మనలో నిరంతరం రూపొం దుతూనే వుంటుంది. అయితే, కరోనా వైరస్‌తో వెంటవెంటనే మరణాలు నమోదు అవటంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్ని అత్యంత వేగంగా ప్రమాదకరంగా వ్యాపించే వ్యాధిగా ప్రకటించడంతో, అప్పటివరకూ మనకేమీ కాదులే అనుకున్న వారందరికీ భయం పుట్టింది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. వీటిని చాలా తేలిగ్గా ఒక జ్వరం గోలీతో పోతుందని ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వాధినేతలూ కూడా ఒక వ్యవస్థగా తాము చేయాల్సింది ఎంతో వుంది అనే ఎరుకలోకి వచ్చారు. కరోనా వైరస్‌ని అరికట్టగలిగిన వాక్సీన్‌ ఇం‌తవరకూ తయారు కాలేదు. ఇది బయటపడి ఇంకా మూడు నాలుగు నెలలు కూడా కాలేదు కాబట్టి ఇంత తొందరగా వాక్సీన్‌ ‌తయారవదు. దానిమీద ఇంకా పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. వాక్సీన్‌ ‌మీద వ్యాపార ఆధిపత్యం కోసం అప్పుడే అగ్ర దేశాల మధ్య పోటీ మొదలయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, వాక్సీన్‌ ‌వచ్చేంతవరకూ వైరస్‌ ‌బారిన పడినవారందరూ చనిపోవలసిందేనా అనేది ఇప్పుడు అందరిలో గూడు కట్టుకుంటున్న భయం.

అయితే కరోనా వైరస్‌ ‌బారిన పడినవారందరూ చనిపోతారా? ఈ వైరస్‌ ‌వ్యాప్తి ఏ విధంగా జరుగుతోంది? ఈ వైరస్‌ ‌వ్యాధి వున్నవాళ్ళు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు బయటకు వచ్చే తుంపర్ల వల్ల, వాటిని చేతులతో తుడుచుకోవటం, మళ్ళీ అదే చేతులతో వస్తువులను, మనుషులను తాకడం వల్ల ఒకరి నుండి ఒకరికి అంటుకుంటోంది. ఈ వైరస్‌ ‌జీవితకాలం మూడు గంటల నుండి మూడురోజుల వరకూ ఉంటోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మొదట్లో ఈ వైరస్‌ ‌వ్యాధి వచ్చిన దేశాల నుంచి వచ్చినవారి ద్వారా మనదేశంలో కొంతమందికి అంటుకుంది. ఆ కొంతమంది మరికొంతమందికి అంటించారు. ఇప్పుడు ఆ వ్యాధి సమూహంగా ప్రతి ఒక్కరికీ వ్యాపించే దశలో ఉందనే వార్తలతో తెలంగాణా ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో జన సమ్మర్థం ఎక్కువ వుండే కొన్నిటి మీద ఆంక్షలు విధించింది. విద్యా సంస్థలను, సినిమా హాళ్ళను మూసివేసింది. ఫంక్షన్‌ ‌హాళ్ళు, పెళ్ళిళ్ళు, బహిరంగ సమావేశాలు, సెమినార్లు, మీటింగుల మీద కూడా ఆంక్షలు వున్నాయి. (మీటింగుల మీద వేరే కారణాలతో ఆంక్షలు ఎప్పటి నుండో అమలవుతున్నాయి. అది వేరే ముచ్చట! తర్వాత చర్చిద్దాం.) అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయమని చెప్పింది. ఇవన్నీ వినడానికి బానే వున్నాయి. ఇక్కడ ప్రభుత్వ చిత్తశుద్ధిని కూడా శంకించడం లేదు. మధ్య ఉన్నత తరగతి నగర సమూహం, మేథావులు కూడా స్వచ్చందంగా తమను తాము వెలివేసుకోవటానికి (ఇది జన్మతః పాటించే ఆ ‘అంటరాని వెలి’ కాదు!?) సిద్ధమైపోయారు! ఎగబడి మరీ దుకాణాలలోని చేతులు శుభ్రం చేసుకునే శానిటైసర్లను, ముక్కుకీ మూతికీ అడ్డం పెట్టుకునే మాస్క్ ‌లను అవసరానికి మించి కొనేసి ఇంట్లో స్టాక్‌ ‌పెట్టేసుకున్నారు.

ఇదే అదునుగా దుకాణాల వారు కూడా వీటి రేట్లను అత్యధికంగా పెంచేశారు! ఇంటికి కావలసిన నిత్యావసర వస్తువులు, సరుకులను మూడునెలలకు సరిపడా కొని పట్టుకెళుతున్నారని ఒక మాల్‌లో పనిచేసే వాళ్లు చెప్పారు. ఇదంతా డబ్బు పెట్టగలిగి, పనికి వెళ్లకపోయినా జరుగుబాటు వున్న కుటుంబాల పరిస్థితి! ఏరోజు కూలికి వెళితే ఆరోజు తిండి దొరికే వాళ్ల పరిస్థితి ఏమిటి? ఎన్ని రోజులు పని మానేసి ఉండగలరు? మరి, మనదేశంలో గానీ, రాష్ట్రంలో గానీ అత్యధిక శాతం మంది ప్రజలకు బయటకు రాకుండా, పని చేయకుండా(ఏ జబ్బు చేసినా గానీ!) రోజు గడిచే పరిస్థితి లేదు. ఇండ్లలో పనిచేసే పని మనుషులు, దినసరి వేతనంతో పనిచేసే అడ్డా కూలీలు, హమాలీలు, పూలూ-పండ్లూ-కూరగాయలు అమ్మేవాళ్ళూ, పారిశుధ్య కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, హోటళ్ళలో పనిచేసే కార్మికులు, ఆర్టిసి కార్మికులు, సఫాయి కార్మికులు, రైల్వే కూలీలు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, మరో ఉపాధి లేని బిచ్చగాళ్ళు, నిరాశ్రయులు, వలస కార్మికులు, సెక్స్ ‌వర్కర్లు, ఇంకా అనేకానేక మంది ఉపాధి సామాజికీకరణలోనే వుంటుంది. ఒక్కరోజు బాటకు వెళ్ళకుండా పని ఆపేసినా వీరందరి జీవితాలూ అల్లకల్లోలమయిపోతాయి. వీరిలో అత్యధిక శాతం మంది పిట్టగూడు లాంటి చిన్న చిన్న ఇరుకు ఇళ్ళలోనే(ఒక్క గదిలోనే కుటుంబమంతా కూడా) సర్దుకోవా ల్సిన పరిస్థితి వుంటుంది. చేయి చాపితే పక్క వాళ్లకు తాకకుండా వుండే పరిస్థితి లేదు. ఏ పనిచేసినా వెంటవెం టనే చేతులు శుభ్రం చేసుకోవటం అదీ శానిటై సర్లతో అనేది అసాధ్యంలో కెల్లా అసాధ్యమైన పని. ఒక పూట స్నానానికి కూడా నీళ్ళు దొరకని వారెందరో ఇప్పుడు లెక్కలు తీయాలి.

నలుగురు పట్టే ఆటోలో నలభైమంది ప్రయాణం చేయాల్సి వచ్చే గ్రామీణ, పట్టణ, నగర శివారు ప్రాంతాల్లో పక్క మనిషిని తాకకుండా ప్రయాణించడం సాధ్యమవు తుందా? తాగటానికే నీళ్ళు దొరకని పరిస్థితుల్లో ప్రతి పదినిముషాలకీ చేతులు శుభ్రం చేసుకోవటం జరిగే పనేనా? పక్క మనుషుల్ని తాకకుండా, మొహాన్ని చేతులతో తాకకుండా, పనికి వెళ్ళకుండావుండటమే ఈ కరోనా జబ్బు వ్యాపించకుండా వుంటుందనేది అందరూ చెబుతున్న విషయమే.మరి,ఈ సామాన్య ప్రజల సంగ తేమిటి? మధ్య,ఉన్నతతరగతి తాము బాగుంటే సరిపోతు ందని అనుకుంటే,ఈ సమూహాల గురించి ఆలోచించే వ్యవస్థ ఎక్కడి నుంచీ రావాలి.దానితో పాటు ఉద్యోగరీత్యా అత్యవ సర పరిస్థితుల్లో విధులు నిర్వర్తించాల్సి వున్న హాస్పిటల్‌ ‌సిబ్బంది, పోలీసులు,రోగ నిర్ధారణ కేంద్రాల సిబ్బంది, పరీ క్షలు నిర్వర్తించాల్సిన ఉపాధ్యాయులు, రవాణా కార్మికులు, పిల్లల్ని సంరక్షించే తల్లులు వుంటారు. మరి, వీరందరి గురించీ ప్రభుత్వాలు ప్రత్యామ్నాయం ఏం ఆలోచిస్తున్నాయి? కేవలం సమాచారం ఇస్తున్నామంటే సరిపోతుందా? ఎవరు వొప్పుకున్నా వొప్పుకోకపోయినా, మన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ చాలా బలహీన మయినది.

ప్రాథమిక ఆరోగ్యం మీద ప్రభుత్వాలు కేటాయించే బడ్జెట్‌ ‌చూస్తే మనకు ఆ విషయం అర్థమైపో తుంది. ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు తక్షణం స్పందించగలిగిన నిపుణులైన సిబ్బంది(డాక్టర్లు, నర్సుల నుంచీ ఏఎన్‌ఎం‌ల వరకూ)కూడా మనకు లేరు. కావలసిన రోగనిర్ధారణ పరీక్షా కేంద్రాలు,అందుకు అవసరమైన సుశిక్షిత సిబ్బంది లేరు. ఒక చేదు వాస్తవమేమంటే, ప్రపంచలోనే అత్యాధునిక వైద్య సౌకర్యాలు వున్నాయని చెప్పుకునే అమె రికాలోనే ఈ కరోనా వ్యాప్తిని అడ్డుకోగలిగే వ్యవస్థ లేదని, పరీక్షా కేంద్రాలు లేవని, కాబట్టి అత్యవసరమైతే తప్ప హాస్పిట ల్‌లో చేర్చుకోవద్దనే ఆదేశాలు ఆరోగ్య శాఖ వారు ఇచ్చార ంటేనే ఆరోగ్య వ్యవస్థ సామాన్యులకు ఎంత దూరంగా వుంటుందో అర్థం చేసుకోవచ్చు.ఇక మనదేశం లాంటి దేశాల్లో ఎంత (అ)స మగ్రంగా వ్యవస్థ వుంటుందో అర్థం చేసుకో వటానికి పెద్దగా కష్టపడనవసరం లేదు. మామూలు పరిస్థి తుల్లోనే క్రూరమైన వెలివేతను ఆచరించే సమాజం,ఇలాంటి పరిస్థితుల్లో బాధిత రోగులను మరింత వెలివేతకు గురిచేయదని ఎలా నమ్మ గలం! కరోనా వైరస్‌తో చనిపోయిన ఒక వ్యక్తిని దహనం చేయటానికి ఢిల్లీలో ఒక స్మశాన నిర్వాహకులు అభ్యంతరం పెట్టారట! ఇలాంటివి ఇంకెన్ని బయటకు వస్తాయో? ఎవరి కి వారు స్వచ్ఛందంగా ఇండ్లలో ఉంటాము అనేది ఆహ్వానిం చదగిన విషయమే అయినప్పటికీ, ఆ నిర్ణయం అందరి జీవితాలకు వర్తించనప్పుడు ప్రత్యామ్నాయాలేమిటీ అని ప్రభుత్వం,సమాజంలోని ఆలోచనా పరులు తీవ్రంగా అన్వే షించాలి. అవసరమైతే, తగు జాగ్రత్త లు తీసుకుంటూనే యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన ఆరోగ్య స్వచ్ఛంద కార్యకర్తలు కావాలి. ఇప్పుడు కావలసింది ఏకాకితనం కాదు, సామూహిక చేతనం, సహానుభూతి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply