Take a fresh look at your lifestyle.

తిరుమల శ్రీవారి ఆలయంలో కొరోనా కలకలం

  • వైరస్‌ ‌బారిన పడ్డ పెద్దజీయంగారు
  • ఆలయ దర్శనాల నిలిపవేతపై ఛైర్మన్‌ ‌సక్ష

తిరుమల శ్రీవారి ఆలయాన్ని కొరోనా వైరస్‌ ‌కుదిపేస్తున్నది. ఇప్పటికే టీటీడీకి చెందిన 15 మందికిపైగా అర్చకులు కొరోనా బారినపడ్డారు. తాజాగా శ్రీవారి ఆలయ పెద్దజీయర్‌ ‌స్వామికి కొరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో టీటీడీ అధికారులు స్వాజీని తిరుపతిలోని పద్మావతి క్వారంటైన్‌కు తరలించారు. తిరుమలలో కేసులు పెరుగుతుండటంతో శ్రీవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసే అంశాన్ని దేవస్థాన అధికారులు పరిశీలిస్తున్నారు. కేసులు క్రమంగా పెరుగుతుండటంతో మార్చి 20న తిరుమల దేవస్థానాన్ని మూసివేశారు. భక్తుల దర్శనాలను నిలిపివేసి, స్వామివారి నిత్య కైంకర్యాలను కొనసాగించారు. అయితే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ‌నిబంధనలను సడలించడంతో సుమారు 80 రోజుల తర్వాత.. జూన్‌ 11‌న శ్రీవారి ఆలయాన్ని తెరిచారు. అప్పటి నుంచి భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. అయితే ఆలయంలో పనిచేస్తున్న 15 మంది అర్చకులతో సహా 140 మందికి • •రోనా సోకింది. ఇందులో టీటీడీ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది, ప్రసాదాలు తయారు సిబ్బంది ఉన్నారు. మొత్తం 50 మంది అర్చకులకు పరీక్షలు నిర్వహించగా, 15 మందికి నిర్ధారణ అయ్యింది.

మరో 25 మందికి సంబంధించిన ఫలితాలు ఇంకా వెళ్లడికాలేదు. మొత్తంగా కొరోనా వైరస్‌ ‌తిరుమలలో రోజురోజుకు విజృంభిస్తోంది. వైరస్‌ ‌బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా శ్రీవారి ఆలయ జీయర్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలపడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు 170 • •రోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదైనట్లు వెల్లడించారు. 18 మంది అర్చకులు, 100 మంది సెక్యురిటీ సిబ్బంది కొరోనా బారిన పడ్డారు. 20 మంది పోటు సిబ్బంది, కల్యాణకట్టలో ఇద్దరికి కొరోనా సోకినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, తిరుమలలో పరిస్థితులపై టీటీడీ చైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి సక్ష నిర్వహించారు. టీటీడీ ఈవో, అదనపు ఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా పరిస్థితిని సక్షించారు. శ్రీవారి దర్శనాల నిలిపివేతపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.• •రోనా వైరస్‌ ‌సోకిన జీయర్‌ ‌స్వాములు, అర్చకులతో పాటు ఇక మిగిలిన టీటీడీ సిబ్బందికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మరోవైపు తిరుమలలో • •రోనా కేసులు పెరుగుతుండటంతో శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనాలను నిలిపివేయాలని ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు ఏవీ రమణ దీక్షితులు కోరారు. ఈమేరకు ఆయన ఆంధప్రదేశ్‌ ‌సీఎం జగన్‌ ‌మోహన్‌రెడ్డి, టీటీడీ చైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డికి ట్విటర్‌ ‌ద్వారా విజ్ఞప్తి చేశారు. శ్రీవారి ఆలయంలో పనిచేసే అర్చకుల స్థానంలో వేరొకరిని తీసుకురాలేమని, వేంకటేశ్వరుని నిత్య ఆరాధనలు ఆపితే మానవ జాతికి మంచిది కాదని పేర్కొన్నారు. అందువల్ల కొన్నివారాల పాటు స్వామివారికి దర్శనాలను ఆపాలని సూచించారు.

కొరోనా సోకిన వారికి చెన్నైలో చికిత్స : చేర్మన్‌ ‌వైవి సుబ్బారెడ్డి
తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాల పర్యవేక్షకులకు అనారోగ్యంపై తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అనారోగ్యానికి గురైన అర్చకులను మెరుగైన వైద్యంకోసం చెన్నైలోని అపోలో దవాఖానకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కైంకర్యాల పర్యవేక్షకుల ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఆలయంలో • •రోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా శ్రీవారి దర్శనాల కొనసాగింపు అంశంపై మరోమారు సక్ష జరుపుతామని చెప్పారు. స్వామివారికి కైంకర్యాలు నిర్వహించే 50 మంది అర్చకుల్లో 15 మందికి • •రోనా వైరస్‌ ‌సోకింది. మరో ఇద్దరికి • •రోనా లక్షణాలు ఉండటంతో వారు కూడా శ్రీవారి కైంకర్యాలకు దూరమయ్యారు. దీంతో స్వామివారి కైంకర్యాలకు అంతరాయం ఏర్పడకుండా తిరుపతిలోని గోవిందరాజుల స్వామి ఆలయంలో పనిచేస్తున్న అర్చకులను డిప్యుటేషన్‌పై శ్రీవారి ఆలయంలో నియమించారు.

Leave a Reply