Take a fresh look at your lifestyle.

దేశంలో అదుపులోనే కొరోనా

న్యూదిల్లీ,జనవరి5 : దేశంలో కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 200లోపే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1,93,051 కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా.. 188 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,319కి  చేరింది.

ప్రస్తుతం దేశంలో 2,554 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24గంటల్లో ముగ్గురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య.. 5,30,710కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ ‌కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించింది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.12 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ ‌డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Leave a Reply