కేసీఆర్ గురించి ప్రజలకు తెలుసు :. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
పీవీ నరసింహారావు దేశాన్ని గొప్పగా నడిపించిన తీరును టి-కాంగ్రెస్ నేతలు గర్వంగా చెప్పుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.శనివారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశం లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… పీవీ నరసింహారావు ఎవ్వరు గొప్పగా చెప్పినా మేము స్వాగతిస్తున్నామన్నారు.టి-కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు .ప్రధానిగా పీవీ సేవలు దేశం ఎప్పుడూ మరవదని ,భారత రత్న కు కాంగ్రెస్ 2009లో కేంద్రానికి అప్పటి కాంగ్రెస్ పార్టీ రికమెండ్ చేసిందని గుర్తు చేశారు .ఆసియా ఖండంలోనే అతిపొడవైన ఫ్లై ఓవర్ కి పీవీ నరసింహారావు నామకరణం కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు.కొరొనా కట్టడిలో కేసీఆర్ ప్రభుత్వం గోర వైఫల్యం చెందిందని కొరొనా వచ్చిన మూడు నెలల తరువాత ఒక్క బెడ్ కూడా అవలేబుల్ గా లేదంటే సిగ్గుపడాల్సిన అంశమని విమర్శించారు. కేసీఆర్ సమర్థత ఏంటో కోవిడ్-19 తో ప్రజలందరూ తెలుసుకున్నారని వ్యాఖ్యానించారు.తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల ప్రజలకు ఒక్క కోవిడ్-19 హాస్పిటల్ మాత్రమే ఉందని మండిపడ్డారు.కేంద్రం కోవిడ్-19 ఫ్రంట్ లైన్ వారియర్స్ కి 50లక్షలు నష్టపరిహారం ప్రకటిస్తే టి-సర్కార్ అమల్లోకి తేలేదని ఆరోపించారు. కేంద్రంతో సహా రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
కోవిడ్ భారిన పడిన పేద కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.విద్యుత్ బిల్లులు అధికంగా ఉన్నందున్న టి-కాంగ్రెస్ ఆధ్వర్యంలో జులై 3న బ్లాక్ బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేస్తామని తెలిపారు .రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబంలో విద్యుత్ బిల్లులు రద్దు చెయ్యాలన్నారు .జులై 4వ తేదీన పెట్రోల్-డీజిల్ తగ్గించాలని నిరసన తెలుపుతామన్నారు.ఈ మీడియా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్స్ పొన్నం ప్రభాకర్ ,కుసుమ్ కుమార్ ,ఏఐసీసీ అధికారప్రతినిధి దాసోజ్ శ్రవణ్ ,మాజీ ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు.