తాండూరు : కొరోనా నియంత్రణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సాయి పుత్ర హోమ్స్ అధినేత శంకర్ యాదవ్ అన్నదానం నిర్వహించారు.గురువారం పట్టణంలో మహమ్మ్మరి నియంత్రణకై లాక్ డౌన్లో విధులు నిర్వర్తిస్తున పోలీస్, మున్సిపల్, అదేవిధంగా వలస కూలీలకు తాండూరు పట్టణానికి చెందిన ప్రముఖ సాయి పుత్ర హోమ్స్ రియల్ ఎస్టేట్ అధినేత శంకర్ యాదవ్ 600 మందికి అన్నదానం చేశారు.
అనంతరం శంకర్ యాదవ్ మాట్లాడుతూ కొరోనా నిర్మూలనకు కృషి చేస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు, మీడియాకు ధన్యవాదాలు తెలియజేశారు. తాండూర్ ప్రజలందరూ పోలీస్ వారికి సకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ వైరస్ నియంత్రణకై భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ నియంత్రణ పాటించాలని అన్నారు. ఇంటి నుండి బయటకు వెళ్ళవలసి వస్తే తప్పక మాస్కు ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్, జొన్నల వినోద్ కుమార్, ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.