Take a fresh look at your lifestyle.

దేశంలో తగ్గని కొరోనా తీవ్రత కొత్తగా 1,813 పాజిటివ్‌ ‌కేసులు

భారత్‌లో కొన్నిరాష్ట్రాల్లో కొరోనా వైరస్‌ ‌విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,813 పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా 71 మంది చనిపోయారని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. బుధవారం సాయంత్రం వరకు దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 31,787కు చేరింది. ప్రస్తుతం  22,982 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 1,008 మంది కరోనా వల్ల మరణించారు. బుధవారం సాయంత్రం వరకు 7797 మంది వ్యాధి నుంచి కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కేరళలో  కొత్తగా 10 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి.

ఇవాళ నమోదయిన కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 495కి చేరింది. కొత్త కేసుల్లో ముగ్గురు హెల్త్ ‌వర్కర్లు, ఒక జర్నలిస్ట్ ఉన్నట్లు సీఎం పినరయ్‌ ‌విజయన్‌ ‌తెలిపారు. అటు యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 123 ఉండగా..మరో 10 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.  తాజాగా చేరిన  10 కేసుల్లో 6 కేసులు కొల్లాంలో నమోదైనవేనని ఆయన వెల్లడించారు. తిరువనంతపురంలో రెండు, కసరగడ జిల్లాలో మరో రెండు నమోదైనట్లు చెప్పారు.

Leave a Reply