Take a fresh look at your lifestyle.

తెలంగాణకు సోకిన కరోనా

  • ఒకటి హైదరాబాద్‌లో ఇంకొకటి దిల్లీలో..
  •  కొత్తగా రెండు కేసులు గుర్తింపు
  • దేశంలో మొత్తం ఐదుకు చేరిన కరోనా కేసుల సంఖ్య
  • కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రక•న
  • ప్రజలు ముందుజాగ్రత్తలు పాటించాలన్న
  • రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల

‌ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్‌ ‌కేసుల పెరుగుతున్నాయి. తాజాగా భారతదేశంలో రెండు కేసులు కనిపించాయి. ఓ వ్యక్తి ఇటలీ నుండి ప్రయాణించి ఢిల్లీకి రాగా డిల్లీలో ఒక కేసు, మరొకరు దుబాయ్‌ ‌సందర్శించి తెలంగాణలో అడుగుపెట్టగా తెలంగాణలో ఓ కేసు కనిపించింది. అని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ వైరస్‌ ‌వల్ల ప్రపంచవ్యాప్తంగా 3,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కనీసంగా 60 దేశాలలో కరోనా వైరస్‌ ‌కేసులు కనిపించాయి. తాజాగా భారతదేశంలో మొత్తం కరోనావైరస్‌ ‌కేసులు ఐదుకి చేరాయి. దీనికి ముందు, భారతదేశంలో మూడు కరోనావైరస్‌ ‌కేసులు నమోదయ్యాయి, కేరళ నుండి ఎక్కువ కేసులు ఉండగా రోగులకు రోగం నయం అయి డిశ్చార్జ్ అయ్యారు. ఇంకొంత మంది కోలుకుంటున్నారు. రోగులు తమ తమ ఇంటిలొనే ఉండాలని రోగులను కేంద్ర ఆరోగ్య శాఖ కోరుతున్నది. గతంలో వుహాన్‌ ‌నుంచి తీసుకువచ్చిన భారతీయులను నిర్బంధంలో ఉంచి వైద్యం అందించిన అనంతరం వారిలో కొందరుని కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల విడుదల చేసింది. శనివారం, మలేషియా నుండి కొచ్చి చేరుకున్న 26 ఏళ్ల వ్యక్తి తీవ్ర జ్వరం కారణంగా మరణించాడు.

కరోనావైరస్‌ ‌కనిపెట్టటం కోసం ప్రాథమిక చికిత్స చేస్తే నెగిటివ్‌ ‌వచ్చినప్పటికీ, తొలి మరణం కేరళలో సంభవించిన నేపధ్యంలో మరణానికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి ఆరోగ్య శాఖ నివేదిక కావాలి అని కేరళ ప్రభుత్వాన్ని కోరింది. యుఎస్‌లో,ఈ వైరస్‌ ‌కారణంగా రెండవ మరణం సంభవించింది. చైనాలో బయటపడిన ఈ వైరస్‌ ఇప్పుడు 60కి పైగా దేశాలలో వ్యాపించి 88,000 మందికి పైగా సోకింది. 2008 ఆర్థిక సంక్షోభం తరువాత ప్రపంచ మార్కెట్లు అతరహా నష్టాలను నమోదు చేస్తున్న తరుణంలో కరోనావైరస్‌ ‌వేగవంతమైన వ్యాప్తి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది అనే భయాలను పెంచింది. చాలా దేశాలు వైరస్‌ ‌బారిన పడ్డ దేశాల పౌరులను టూరిజం కోసం తమ దేశాలకు రాకుండా నిషేధించాయి. అలాగే తమ దేశ పౌరులను కరోనా వైరస్‌ ‌వ్యాధిగ్రస్త దేశాలకు వెళ్లవద్దని అడ్వైజర్లు జారీ చేశాయి.  ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే మ్యూజియం ‘‘లౌవ్రే’’ లో కరోనా వైరస్‌ ‌గురించి భయపడి, పనిచేయడానికి సిబ్బంది నిరాకరించడంతో ఆదివారం ‘‘లౌవ్రే’’ మ్యూజియం మూసివేశారు.

  • బెంగళూరు నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా
  • గాంధీ దవాఖానాలో చికిత్స: మంత్రి ఈటల

First corona case in Hyderabad

బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే తెలంగాణకు చెందిన 25 ఏళ్ల వ్యక్తికి కోరానా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందనీ, ప్రస్తుతం ఆ వ్యక్తికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌వెల్లడించారు. కరోనా సోకిన వ్యక్తి ఫిబ్రవరి 17న దుబాయి వెళ్లి నాలుగు రోజుల పాటు హాంకాంగ్‌ ‌వ్యక్తులతో కలసి పనిచేశారనీ, బెంగళూరు నుంచి బస్సులో హైదరాబాద్‌ ‌వచ్చినట్లు తెలిపారు.కరోనా పాజిటివ్‌కు ముందుగా అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్‌ ‌జరిగిందనీ, ఆ బస్సులో మొత్తం 27 మంది ప్రయాణించినట్లు తెలిసిందని పేర్కొన్నారు. ఆ 27 మందిని వెతికే పనిలో ఉన్నామనీ, వారికి సంబంధించిన కుటుంబ సభ్యులలో 80 మందిని గుర్తించామనీ, వారికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పాజిటివ్‌ ‌కేసుగా నమోదైన వ్యక్తిని ఆదివారం పరీక్షించి టెస్టులు పూణేకు పంపగా, పాజిటివ్‌గా కేసు నమోదైనట్లు వెల్లడించారు. ఐసోలేషన్‌ ‌వార్డులో ఉంచి వైద్య
చికిత్సలు అందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారనీ, మున్సిపల్‌ ‌శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినట్లు వెల్లడించారు. జలుబు, దగ్గు, జ్వరం, ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైన లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలనీ, చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలనీ, వీలైనంత వరకూ ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలని సూచించారు. కొద్ది రోజుల పాటు దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిదనీ, అలాగే, పెంపుడు జంతువులు ఉంటే వాటికి దూరంగా ఉండాలని పేర్కొన్నారు. గర్శిణీలు, బాలింతలు, వృద్ధులు, పిల్లలకు రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందనీ, అందువల్ల ఈ వైరస్‌ ‌త్వరగా సోకే అవకాశం ఉన్నందున వాళ్లు ఎక్కువగా చలి ప్రదేశాలలో తిరగరాదని పేర్కొన్నారు. ఇతరులు, అపరిచితులకు దూరంగా ఉం•డాలనీ, ఇంటి పరిసరాలతో పాటు ఇంట్లో పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని వివరించారు. బహిరంగ ప్రదేశాలలో దగ్గిన, తుమ్మిన సమయంలో చేతి రుమాలు లేదా టవల్‌ను ముక్కు, నోటికి అడ్డు పెట్టుకోవడంతో పాటు మాస్క్‌ను ధరించాలని కరపత్రంలో స్పష్టం చేశారు.

Leave a Reply